ఇలా ప్లాన్ చేసుకుంటే అందరికీ కష్టమే కదా బాసూ..?
టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ తమ తదుపరి ప్రాజెక్టుల కోసం అనేక మంది దర్శకులను క్యూలో పెడుతున్నారు. ఒక్కొక్కరు ముగ్గురు నుండి ఆరుగురు దర్శకులతో భవిష్యత్ సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళి వంటి దర్శకులతో సినిమాలు చేసిన తర్వాత వచ్చే గ్యాప్‌లను పూడ్చుకోవడానికి ఈ వ్యూహం ఉపయోగిస్తున్నారు. ఇది వారి కెరీర్ ప్లానింగ్‌లో భాగంగా నిరంతర సినిమా ప్రవాహాన్ని నిర్ధారిస్తుంది.
మీరు క్యూలో ఉన్నారు.. ఇప్పుడు మన స్టార్ హీరోలు దర్శకులతో చెప్తున్న మాట ఇదే. ఒక్కొక్కరు ఒక్కరు ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు నలుగురు.. కొందరైతే ఏకంగా అరడజన్ మంది దర్శకులను బ్యాకప్‌లో ఉంచారు. వాళ్ల సినిమాలు సెట్స్‌పైకి వచ్చేదెప్పుడో తెలియదు కానీ.. బ్యాకప్ మాత్రం పీక్స్‌లో ఉంది. మరి ఏ హీరో ఎవర్ని లైన్‌లో పెట్టారో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా.. రాజమౌళితో సినిమా చేస్తున్నపుడు తెలియకుండానే భారీ గ్యాప్స్ కామన్.. అందుకే ఆ తర్వాత వేగం పెంచేస్తుంటారు హీరోలు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇదే చేస్తున్నారిప్పుడు. ముఖ్యంగా చరణ్ అయితే గేమ్ ఛేంజర్ సెట్స్‌పై ఉన్నపుడే బుచ్చిబాబుతో పెద్దికి ఓకే చెప్పారు.. ఇది సెట్స్‌పై ఉండగానే సుకుమార్ సినిమాకు సై అనేసారు. 2026లోనే సుకుమార్, చరణ్ సినిమా పట్టాలెక్కనుంది. మరోవైపు ఎన్టీఆర్ కూడా అంతే. ట్రిపుల్ ఆర్ తర్వాత దేవరకు టైమ్ తీసుకున్న తారక్.. ఆ తర్వాత మాత్రం జోరు పెంచేసారు. గతేడాది వార్ 2తో వచ్చిన ఎన్టీఆర్.. నీల్ సినిమాతో బిజీగా ఉన్నారిప్పుడు. దీని తర్వాత కొరటాల శివ దేవర 2తో రెడీగా ఉన్నారు.. అలాగే త్రివిక్రమ్, నెల్సన్ అంటూ తారక్ బ్యాకప్ పక్కాగా ఉంది. ప్రభాస్ దూకుడు నెక్ట్స్ లెవల్‌లో ఉంది. ఈయన లిస్టులో అరడజన్ మంది దర్శకులున్నారు. ప్రస్తుతం ఫౌజీతో పాటు స్పిరిట్‌తో బిజీగా ఉన్న ప్రభాస్.. నాగ్ అశ్విన్‌తో కల్కి 2, ప్రశాంత్ నీల్‌తో సలార్ 2 లైన్‌లో పెట్టారు. వీళ్లు కాకుండా ప్రశాంత్ వర్మ, లోకేష్ కనకరాజ్ పేర్లు కూడా ప్రభాస్ దర్శకుల లిస్టులో వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ దర్శకుల లిస్ట్ చూస్తుంటే ఎవ్వరికైనా కళ్లు బైర్లు గమ్మాల్సిందే. ప్రస్తుతం అట్లీతో సినిమా చేస్తున్న బన్నీ.. నెక్ట్స్ లోకేష్ కనకరాజ్‌తో ఓకే అనేసారు. ఇక ఈయన కోసం టాలీవుడ్ నుంచి బోయపాటి శ్రీను, సుకుమార్, త్రివిక్రమ్ వేచి చూస్తుంటే.. బాలీవుడ్ నుంచి ధురంధర్ ఫేమ్ ఆదిత్య ధర్, సంజయ్ లీలా భన్సాలీ కథలు సిద్ధం చేస్తున్నారు. మొత్తానికి మన స్టార్స్ బ్యాకప్ ఇలా ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
A. R. Rahman: 30 ఏళ్ళ తర్వాత ఆ సినిమాతో తెలుగు లోకి అడుగుపెడుతున్న రెహ్మాన్
Allu Arjun: అల్లు అర్జున్‌ను టార్గెట్ చేసింది వాళ్లేనా
గ్రాఫిక్స్ ఎంతవరకు వచ్చింది.. అసలు విశ్వంభర రిలీజ్ అవుతుందా ?? లేదా ??
కాయ్ రాజా కాయ్.. డబ్బుకు రెట్టింపు డబ్బు ఇస్తాం.. కట్ చేస్తే
ఉద్యోగం పేరుతో నిరుద్యోగికి రూ. 1.50 లక్షల టోకరా.. ఫేక్ ఐపీఎస్ అరెస్ట్