టాలీవుడ్‌లో గేరు మార్చిన హీరోయిన్లు… బిగ్ హిట్ కోసం భారీ ప్లాన్..!

Edited By:

Updated on: Jul 18, 2026 | 4:32 PM

టాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకుంటున్న భాగ్యశ్రీ బోర్సే, కయాదు లోహర్, మమితా బైజు, సంయుక్త మీనన్ తమ కెరీర్‌లో కీలక దశకు చేరుకున్నారు. 'లెనిన్' విజయంతో జోరు మీదున్న భాగ్యశ్రీతో పాటు, భారీ ప్రాజెక్టులతో మిగతా హీరోయిన్లు కూడా బిగ్ హిట్ కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమాల ఫలితాలే వారి భవిష్యత్ స్టార్‌డమ్‌ను నిర్ణయించనున్నాయి.

టాలీవుడ్‌ మీద సీరియస్‌గా ఫోకస్ చేస్తున్న బ్యూటీస్ స్పీడు పెంచారు. భాగ్యశ్రీ బోర్సే, కయాదు లోహర్‌, మమితా బైజు, సంయుక్త మీనన్‌… ఇప్పుడు టాలీవుడ్‌లో గేరు మార్చారు. అప్‌ కమింగ్ మూవీస్‌తో కెరీర్‌లో బిగ్ హిట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. భాగ్యశ్రీ బోర్సే రీసెంట్‌గా ‘లెనిన్‌’తో సక్సెస్ అందుకోగా.. మిగతా బ్యూటీస్ కూడా అదే బాటలో సక్సెస్‌ ట్రాక్‌లోకి వచ్చేందుకు కష్టపడుతున్నారు. మిస్టర్ బచ్చన్‌ మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే.. రీసెంట్‌గా అఖిల్‌ మూవీ ‘లెనిన్‌’తో తొలి సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. భారతి పాత్రలో ఆమె నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. లెనిన్ సక్సెస్ తరువాత ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా.. తమిళంలో శివకార్తికేయన్‌తో ‘సీయోన్’ సినిమా చేస్తున్నారు. తెలుగులో కూడా కొత్త కథలు వింటూ నెక్స్ట్ ప్రాజెక్ట్ సెట్ చేసే పనిలో ఉన్నారు భాగ్యశ్రీ. భాగ్యశ్రీ బాటలో నెక్స్ట్ హిట్ అందుకోవడానికి రెడీ అవుతున్నారు మమితా బైజు. ‘ప్రేమలు’ తో ఓవర్ నైట్ స్టార్ అయిన మమితా.. సూర్యతో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, విజయ్‌తో ‘జన నాయగన్’ లాంటి భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలతో బిగ్‌ హిట్ అందుకొని తెలుగు ఆడియెన్స్‌కు మరింత దగ్గర అవ్వాలనుకుంటున్నారు. మరో వైపు కయాదు లోహర్‌ కూడా అప్‌కమింగ్ మూవీస్ మీదే ఆశలు పెట్టుకున్నారు. పాన్‌ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’ తో బిగ్ హిట్ గ్యారెంటీ అన్న నమ్మకంతో ఉన్నారు. ఒకప్పుడు టాలీవుడ్‌లో గొల్డెన్‌ లెగ్‌గా పేరు తెచ్చుకున్న సంయుక్త మీనన్‌, ఆ తరువాత స్లో అయ్యారు. ఈ గ్యాప్‌ను కవర్‌ చేసేలా ‘స్వయంభూ’, ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’, ‘ది బ్లాక్ గోల్డ్’ మూవీస్‌తో వరుసగా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాల్లో ఏ ఒక్క మూవీ సూపర్ హిట్ అయినా… టాలీవుడ్ స్క్రీన్ మీద మళ్లీ సంయుక్త టైమ్ స్టార్ట్ అవుతుంది. మరి వీళ్లలో ఎవరు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్టార్ హీరోల రికార్డులే… దర్శకులకు ఇప్పుడు అతిపెద్ద పరీక్ష..!

Follow Us