టాలీవుడ్ లో తప్పని హీరోయిన్ల కొరత.. కారణం అదేనా ??
తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త హీరోయిన్లు పరిచయం అవుతున్నా, నిలదొక్కుకునేవారు తక్కువ. ఇది హీరోలకు హీరోయిన్ల కొరతను సృష్టిస్తోంది. శ్రీలీల వంటివారు రేసులో లేకపోవడం, సీనియర్ తారలు నిష్క్రమించడంతో, కొత్త తారల సక్సెస్ అనివార్యం. లేదంటే పరిశ్రమ పాత సమస్యనే ఎదుర్కొంటుంది. సినిమాకో కొత్త హీరోయిన్ పరిచయం అవుతుంది కానీ ఏం లాభం..? ఒక్కరు కూడా సక్సెస్ కావట్లేదు కదా..!
సినిమాకో కొత్త హీరోయిన్ పరిచయం అవుతుంది కానీ ఏం లాభం..? ఒక్కరు కూడా సక్సెస్ కావట్లేదు కదా..! అందుకేగా మన హీరోలకు ఈ హీరోయిన్ల తిప్పలు. ఇప్పటికిప్పుడు చూసుకున్నా కూడా ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ స్టార్ అయ్యేలా కనిపించడం లేదు. రేసులో ఉన్న వాళ్లకు హిట్లు లేవు.. హిట్లున్న వాళ్ళేమో రేసులో లేరు. అసలేం జరుగుతుంది ఇండస్ట్రీలో..? కొత్తమ్మాయిలు రావడం కాదు.. వచ్చిన వాళ్లు సక్సెస్ అయినపుడే హీరోయిన్ల కష్టాలకు కనీసం కామా అయినా పడుతుంది. ఇదే జరగట్లేదు. హీరోయిన్లు చాలా మంది ఇండస్ట్రీకి వస్తున్నారు కానీ నిలబడే వాళ్లు తక్కువ. మిస్టర్ బచ్చన్‌తో ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సేకు ఇప్పటికీ చెప్పుకోదగ్గ హిట్ రాలేదు. కాంతాతో నటిగా పేరొచ్చింది.. నెక్ట్స్ ఆంధ్రాకింగ్ తాలూకతో వస్తున్నారు. ప్రభాస్, హను రాఘవపూడి సినిమాతో పరిచయమవుతున్న ఇమాన్వి ఇస్మాయిల్ గురించి చర్చ బాగా జరుగుతుందిప్పుడు ఇండస్ట్రీలో. ఈ సినిమా విడుదలకు ముందే ఇమాన్వికి ఆఫర్స్ వస్తున్నాయి. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాతో రుక్మిణి వసంత్ కూడా హాట్ టాపిక్కే. కాంతార ఛాప్టర్ 1తో ఈమె రేంజ్ పెరిగింది. అలాగే రవితేజ సినిమాతో ఆషికా రేసులోకి వస్తానంటున్నారు. భర్త మహాశయులకు విజ్ఞప్తి హిట్టైతే ఆషికా రంగనాథ్ దశ తిరిగినట్లే. అలాగే రాజా సాబ్‌పై మాళవిక మోహనన్‌తో పాటు నిధి అగర్వాల్ ఆశలు పెట్టుకున్నారు. వీళ్లే టాలీవుడ్ ఫ్యూచర్. ఎందుకంటే శ్రీలీల రేసులో లేదు.. సమంత, తమన్నా, శృతి, నయనతార సీనియర్లు అయిపోయారు.. ఉన్నంతలో వీళ్లు సక్సెస్ అయితేనే హీరోయిన్ల కొరత తీరుతుంది.. లేదంటే పాత సమస్యే మళ్లీ మొదలవుతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Varanasi: రెండు భాగాలుగా రానున్న వారణాసి.. నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్