ఆగస్టు అంతా సినిమాల సందడే.. టాక్సిక్ నుంచి వారణాసి వరకు వరుస బిగ్ అప్‌డేట్స్!

Edited By:

Updated on: Aug 06, 2026 | 5:41 PM

ఆగస్టు నెల టాలీవుడ్ అభిమానులకు స్పెషల్‌గా మారబోతోంది. టాక్సిక్ ట్రైలర్, ది ప్యారడైజ్ టీజర్, మహేష్ బాబు–రాజమౌళి ‘వారణాసి’ అప్‌డేట్, అల్లు అర్జున్ ‘రాకా’ విశేషాలతో పాటు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘విశ్వంభర’, మెగా158 అప్‌డేట్లు, నాగార్జున ‘కింగ్ 100’ టీజర్ వచ్చే అవకాశాలతో సినీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

ఆగస్టులో అందరి చూపు టాక్సిక్, ఇరుముడి, కొరియన్ కనకరాజు లాంటి క్రేజీ సినిమాలపై ఉంది కానీ దాన్ని మించిన ఎక్సైట్‌మెంట్ తీసుకొచ్చే విషయాలు చాలానే ఉన్నాయి. కొత్త సినిమాలతో పాటు ఫ్యాన్స్‌ను చాలా కాలంగా ఊరిస్తున్న అప్‌డేట్స్ రాబోతున్నాయి. ముఖ్యంగా ప్యాన్ ఇండియన్ సినిమా అప్‌డేట్స్ కూడా..! టాలీవుడ్‌కు ఆగస్ట్ స్పెషల్ మంత్ కాబోతుంది. అదెలాగో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..? ఆగస్ట్ ఇలా మొదలైందో లేదో అప్పుడే చాలా అప్‌డేట్స్ వచ్చాయి. ఎల్లమ్మ నుంచి దేవీ శ్రీ ప్రసాద్ ఫస్ట్ లుక్ వచ్చింది.. కింగ్ 100, కార్తి 30 సినిమాలకి దేవీని మ్యూజిక్ డైరెక్టర్‌గా కన్ఫర్మ్ చేసారు. అలాగే అల్లు అర్జున్ రాకా మేజర్ అప్‌డేట్ ఒకటి ఆగస్ట్‌లోనే రానుంది. కుదిర్తే టీజర్‌తో పాటు 2 పార్ట్స్‌గా ఈ సినిమాను తెరకెక్కించబోయే విషయాన్ని కూడా ఆగస్టులోనే అభిమానులకు చెప్పనున్నారు మేకర్స్. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ప్యాన్ ఇండియన్ సినిమా ది ప్యారడైజ్ టీజర్ ఆగస్ట్ 6న రానుంది. 95 సెకన్ల ప్యూర్ మ్యాడ్ నెస్ ఏంటో చూస్తారంటూ ఇప్పటికే ప్రామిస్ చేసారు శ్రీకాంత్ ఓదెల. ఈ సినిమా అనుకున్న దానికంటే లేట్ అవుతున్నా.. ప్యారడైజ్‌పై నాని, ఓదెల కాన్ఫిడెన్స్ చూస్తుంటే మాత్రం భలే ముచ్చటేస్తుంది. ఇక టాక్సిక్ ట్రైలర్ ఆగస్ట్ 8న రానుంది. ఆగస్ట్ 9న మహేష్ పుట్టిన రోజు సందర్భంగా మోస్ట్ అవైటెడ్ వారణాసి సినిమాకు సంబంధించిన అప్‌డేట్ రానుందని కళ్ళలో ఒత్తులేసుకుని మరీ చూస్తున్నారు ఫ్యాన్స్. రాజమౌళి కూడా ఈసారి అభిమానుల ఆశ నెరవేర్చేలా కనిపిస్తున్నారు. కుదిర్తే వారణాసి నుంచి లుక్ కానీ లేదంటే మహేష్ జర్నీకి సంబంధించిన ఓ వీడియోను కానీ ఆగస్ట్ 9న విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఆగస్ట్‌లోనే మరో రెండు మేజర్ అప్‌డేట్స్ రానున్నాయి. అందులో మెగాస్టార్ బర్త్ డే ఒకటి. ఆగస్ట్ 22న విశ్వంభర టీజర్‌తో పాటు బాబీ తెరకెక్కిస్తున్న మెగా158 సినిమా టీజర్ కూడా విడుదల చేయనున్నారు. అలాగే మెగా 159 అప్‌డేట్ రానుంది. అలాగే ఆగస్ట్ 29న నాగార్జున బర్త్ డే సందర్భంగా కింగ్ 100 టైటిల్‌తో పాటు టీజర్ వచ్చే అవకాశాలున్నాయి. అందుకే ఆగస్ట్ ఈసారి మోస్ట్ స్పెషల్ మంత్ అనేది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వీళ్లు తలతో కొడితే కొబ్బరికాయైనా పగలాల్సిందే

Health Benefits of Punarnava: ఈ ఆకు పచ్చడి చేసుకుని తింటే.. మోకాళ్ల నొప్పులు పరార్‌

ఆ ఊరే.. ఓ రంగస్థలం.. అక్కడ అందరూ పాత్రధారులే..!

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు డిస్కో లైట్ల బెడద.. ల్యాండింగ్ వేళ ముప్పుగా మారిన లేజర్‌ లైట్లు

ప్రాణాలు తీస్తున్న లిఫ్ట్‌ ప్రమాదాలు.. రెండు రోజుల్లో ఇద్దరు మృతి

Loading...
Unable to load recommendations.
Follow Us