TOP 9 ET: దిమ్మతిరిగే రేంజ్‌లో రెస్పాన్స్..! | బాలయ్యకు ముహూర్తం ఫిక్స్..
మెగా నిర్మాత అల్లు అరవింద్ తాజాగా కొండాపూర్‌లోని సిఆర్ కళాక్షేత్రంను ఓపెన్ చేసారు. ఇది ఓపెన్ ఎయిర్ థియేటర్. ఈయన లాంఛ్ చేసిన ఫోటోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. థియేటర్ చాలా బాగుందని.. కచ్చితంగా రాబోయే రోజుల్లో సిఆర్ కళాక్షేత్రం మరో స్థాయికి వెళ్తుందని తెలిపారు మెగా నిర్మాత.
01. BRO
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ బ్రో సినిమా టీజర్‌కు రెస్పాన్స్ అదిరిపోయింది. ముఖ్యంగా యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ సాధిస్తుంది. మొదటి రోజే 25 మిలియన్స్ అంటే.. 2.5 కోట్ల మంది ఈ టీజర్ చూసారు. ఇదే కాకుండా ఈ టీజర్‌కు 600కె లైక్స్ రాగా… 16 వేల కామెంట్స్ వచ్చాయి. ఇక యూట్యూబ్‌లోనే ఇలా ఉంటే.. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లాంటి ప్లాట్ ఫామ్స్‌లో బ్రో రేంజ్ ఎలా ఉందో ఊహించుకోవచ్చు.
02.NBK Bobby
నందమూరి నటసింహం బాలకృష్ణ వరస విజయాలతో జోరు మీదున్నారు. అఖండ తర్వాత మొన్న సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’తో మరో విజయం అందుకున్నారీయన. ప్రస్తుతం అనిల్ రావిపూడితో భగవంత్ కేసరి సినిమా చేస్తున్న బాలయ్య.. అది సెట్స్‌పై ఉండగానే దర్శకుడు బాబీతో ఓ భారీ సినిమాకు శ్రీకారం చుట్టారు. సితార బ్యానర్‌లో వస్తున్న ఈ సినిమా మార్చ్ 22, 2024న విడుదల కానుందని ప్రచారం జరుగుతుంది.
03.Hanuman
సంక్రాంతి రేసులోకి వెళ్లింది హనుమాన్ సినిమా. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. సూపర్ హీరో కథాంశంతో తెరకెక్కుతోంది. హనుమాన్ అండతో దుష్టశక్తులపై ఓ యువకుడు సాగించిన పోరాటమే నేపథ్యంగా తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
04. SPY
నిఖిల్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేషనల్ థ్రిల్లర్ ‘స్పై’. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రాన్ని చరణ్ తేజ్ ఉప్పలపాటి సీఈఓగా ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై కె రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటించారు. తొలిరోజే 11 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్ర సక్సెస్ మీట్ వైభవంగా నిర్వహించింది చిత్రయూనిట్.
05.Allu Aravind
మెగా నిర్మాత అల్లు అరవింద్ తాజాగా కొండాపూర్‌లోని సిఆర్ కళాక్షేత్రంను ఓపెన్ చేసారు. ఇది ఓపెన్ ఎయిర్ థియేటర్. ఈయన లాంఛ్ చేసిన ఫోటోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. థియేటర్ చాలా బాగుందని.. కచ్చితంగా రాబోయే రోజుల్లో సిఆర్ కళాక్షేత్రం మరో స్థాయికి వెళ్తుందని తెలిపారు మెగా నిర్మాత.
06.kajal
ఇండియన్ 2 లొకేషన్‌లోనే ఉన్నానని అన్నారు నటి కాజల్. ఇండియన్2 టీమ్, మూవీతో పాటు తన రోల్ విషయంలోనూ హ్యాపీగా ఉన్నానని అన్నారు. లస్ట్ స్టోరీస్ 2లో తమన్నా యాక్టింగ్ అద్భుతంగా ఉందని చెప్పారు. చాలెంజెస్, ఎక్స్ పీరియన్సెస్ తనకు ఈ రంగంలో పాఠాలు నేర్పాయని అన్నారు కాజల్.
07.captain miller
ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా కెప్టెన్ మిల్లర్. ఈ సినిమా ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వస్తోంది. 1930-40 మధ్య కాలంలో జరిగిన ఆసక్తికర కథాంశంతో యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ధనుష్ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ఇది. తెలుగు, తమిళ్, హిందీలో ఒకే సమయంలో విడుదల కానుంది.
08. Iddaru
యాక్షన్ కింగ్ అర్జున్, రాధికా కుమారస్వామి, సోనీ చరిష్టా, జె.డి.చక్రవర్తి, ముఖ్యపాత్రల్లో సమీర్ తెరకెక్కించిన సినిమా ఇద్దరు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. తాజాగా సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు మేకర్స్. జులై 7న ఈ సినిమా థియేటర్స్‌లోకి రానుంది. కచ్చితంగా సినిమా అలరిస్తుందని నమ్మకంగా చెప్తున్నారు మేకర్స్.
09. Siddarth Roy
సిద్ధార్థ్ రాయ్ చిత్రం టీజర్‌తోనే టాలీవుడ్‌లో చర్చకు తెర తీసింది. పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ ఈ సినిమాతో హీరోగా పరిచయమౌతున్నారు. వి యశస్వీ దర్శకుడు. ఈ మధ్యే విడుదలైన టీజర్ చాలా బోల్డ్‌గా ఉంది. తాజాగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ సిద్ధార్థ్ రాయ్ టీమ్‌ని అభినందించారు. దీపక్ సరోజ్, దర్శకుడు వి యశస్వీ ని పుష్ప2 సెట్స్‌కి ఆహ్వానించిన సుకుమార్ తన బెస్ట్ విషెస్ అందించారు. టీజర్ తనకి చాలా నచ్చిందని, కంటెంట్ యూనిక్‌గా వుందని ప్రశంసించారు లెక్కల మాస్టారు.