TOP9 ET: జనసేనకు ఉపాసన 5 కోట్ల విరాళం? ట్రూ? / ఫేక్‌? | ఇద్దరి మధ్యన నలిగిన స్టోరీ ఇది!

|

Apr 08, 2024 | 9:17 AM

అనసూయ- దేవరకొండ! అర్జున్ రెడ్డి దగ్గర నుంచి మొదలైన వీరి లొల్లి జర్నీ ఆగినట్టే ఆగిపోయి మళ్లీ నెట్టింట ఏదో ఒక రకంగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. వీరిద్దరూ సైలెంట్‌గా ఉన్న వీరి ఫ్యాన్స్ మధ్య చిన్న పాటి యుద్ధానికి దారి తీస్తూనే ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో.. విజయ్‌ దేవరకొండ క్యాజువల్‌గా తన ఫ్యాన్స్‌ను అన్న ఓ బూతు మాట ఇప్పుడు నెట్టింట సెన్సేషనల్ అయింది.

01. kalki: యాక్షన్ కాదు.. రొమాన్స్‌.!

గురి చూసి కొట్టేలే కానీ ఏ కాయ అయినా కింద పడాల్సిందే! పాన్ ఇండియా హీరో తో సినిమా చేయాలే కానీ.. మన కెమెరాకు పని చెప్పి.. నెట్టింట ట్రెండ్ అవ్వాల్సిందే..! ఆ హీరోతో క్యాండిడ్ మూమెంట్స్‌ను క్రియేట్ చేసి.. పది మంది నోళ్లలో నానాల్సిందే. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ కూడా చేస్తోంది ఇదే. ప్రభాస్ కల్కి మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్న ఈ బ్యూటీ… ఇటలీలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌ విశేషాలను ఫోటోలు.. వీడియోల రూపంలో తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. వాటి మధ్యలోనే మరోసారి డార్లింగ్ ప్రభాస్‌ తో తాను తీసుకున్న సెల్ఫీని కూడా పోస్ట్ చేసి.. నెట్టింట మరో సారి ట్రెండ్ అవుతున్నారు దిశా..!

02. vijay naga chaitanya: ఇద్దరి మధ్యన నలిగిన స్టోరీ ఇది

ఐరనే వంచాలా ఏంటి? అంటూ.. ఫ్యామిలీ స్టార్‌గా మన ముందుకు వచ్చిన విజయ్‌ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ.. రీసెంట్‌గా రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది. కానీ దాంతో పాటే.. ఈ సినిమా గురించి, ఈ సినిమా స్టోరీ గురించి నెట్టింట ఓ చిన్న పాటి చర్చ నడుస్తోంది. ఫ్యామిలీ స్టార్ స్టోరీ ఇద్దరు స్టార్స్‌ మధ్యన నలిగిన స్టోరీ అంటూ ఓ కామెంట్ వైరల్ అవుతోంది. ఎందుకంటే..! ఈ సినిమా స్టోరీని మొదట గీతా ఆర్ట్స్ బ్యానర్లో.. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య తో.. డైరెక్టర్ పరుశురామ్‌ తెరకెక్కించాల్సిందట. కానీ కొన్ని కారణాల వల్ల.. ఈ డైరెక్టర్.. దిల్ రాజు, విజయ్‌ కాంపౌండ్‌కి షిఫ్ట్ కావాల్సి వచ్చిందట.

03. rashmika: పుష్ప గాడి పిల్ల.. బంగారంలా మెరిపోతోందిగా.!

పుష్ప ది రైజ్‌లో.. పుష్ప గాడి పిల్ల శ్రీవల్లి డీగ్లామరస్గా.. చాలా సాదా సీదాగా… కనిపించింది. అయినా కూడా అందర్నీ తన వంకే చూసేలా చేసుకుంది. కానీ ఇప్పుడు నెక్ట్సంతా పుష్ప గాడి రూలు..! అందుకే శ్రీవల్లి గెటప్‌ అండ్ సెటప్‌ను కూడా మార్చాడు డైరెక్టర్ సుక్కు. ఖరీదైన పట్టు సారీలో.. బంగారు ఆభరణాలతో చాలా లావిష్‌గా ఈ సారి శ్రీవల్లిని ప్రజెంట్ చేశారు. రష్మిక బర్త్‌డే కావడంతో.. తన లుక్‌ను రీసెంట్గా రిలీజ్ కూడా చేశారు సుక్కు.

04. family satr: మొత్తానికి ఐరన్ దించాడుగా.!

ది విజయ్‌ దేవరకొండ.. ఫ్యామిలీ స్టార్ సినిమాలో ఐరన్ వంచడమే కాదు.. తన ఫ్యాన్స్ అండ్ ఫిల్మ్ లవర్స్ గుండెల్లో.. అదే ఐరన్‌ను దించేశాడు. స్టైలింగ్‌, యాక్షన్, ఎమోషన్స్ తో సినిమాలో వన్‌ మ్యాన్ షో చేశాడు. మెచ్చ్యూర్డ్‌ యాక్టింగ్‌తో అందిర్నీ చప్పట్లు కొట్టేలా చేసుకున్నాడు. విజయ్‌కు తోడు.. డైరెక్టర్ పరుశురామ్ తన డైలాగ్‌ రైటింగ్ స్కిల్స్‌తో థియేటర్లో రాంపేజ్ చూపించాడు. అందుకే అన్నట్టు డే1 మంచి కలెక్షన్స్‌ కూడా వచ్చేలా చేసుకున్నాడు విడీ అండ్ పరుశురామ్.

05.Amala Paul: అటు పబ్బుల్లో డ్యాన్స్‌.. ఇటు సీమంతం!

తల్లి అవుతున్నారనే గుడ్ న్యూస్ తెలియగానే.. ఎగిరి గంతేయడం కాదు.. చాలా జాగ్రత్తగా.. కడుపులో ఉన్న బేబీకి ఏం కాకుండా చూసుకుంటూ ఉంటారు. కానీ అమలా పాల్ మాత్రం అలా కాకుండా.. నెలలు నిండిన కడుపుతోనే.. పబ్బులు, మూవీ ప్రచారాలంటూ.. నిన్న మొన్నటి వరకు నానా హంగామా చేశారు. ఇక ఇప్పుడేమో.. ట్రెడీషనల్గా.. చాలా గ్రాండ్‌గా సీమంతం చేయించుకున్నారు. ఇక ఆ వీడియోతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూనే మరో సారి అందర్నీ షాక్ అయ్యేలా చేస్తున్నారు.

06. surya: ముకుటేశ్వర ఆలయంలో రోలెక్స్

సినిమాలో రోలెక్స్‌ అయినా… బయట మాత్రం దైవ భక్తి ఉన్నవాడే హీరో సూర్య. అయితే ఎప్పుడూ షూటింగ్స్‌తో.. సామాజిక కార్యక్రమాలతో బిజీగా ఉండే ఈ హీరో.. గుళ్లలో కనిపించింది మాత్రం చాలా తక్కువే. కానీ తాజాగా తీరిక దొరికిందో ఏమో కానీ ఉన్నట్టుండి మకుటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమయ్యాడు ఈ హీరో. ఈరోడ్‌ జిల్లా… కొడుముడియల ప్రాంతంలో ఉన్న మకుటేశ్వర స్వామిని సంప్రదాయ పంచకట్టులో వచ్చి దర్శించుకున్నాడు. ఆ వీడియోతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాడు.

07. upasana: జనసేనకు ఉపాసన 5 కోట్ల విరాళం? ట్రూ? / ఫేక్‌?

‘పవన్‌ జనసేనకు ఉపాసన 5 కోట్ల విరాళమిచ్చారు.’ ఇది ఇప్పుడు కొందరి జనసైనికుల స్టేటస్‌లో కనిపిస్తున్న న్యూస్. సోషల్ మీడియాలో ఇప్పుడిప్పుడే వైరల్ అవుతున్న పోస్ట్. అయితే ఈ న్యూస్‌లో ఎలాంటి నిజం లేదు! ఎట్ ప్రజెంట్ ఉపాసన జనసేనకు 5 కోట్ల విరాళమేం ఇవ్వలేదు. జనసేన అఫీషియల్ ట్విట్టర్ ఎక్స్‌ పేజ్లో కానీ.. ఉపాసన అఫీషియల్ సోషల్ మీడియా పేజెస్‌లో కానీ.. ఇందుకు సంబంధించిన పోస్ట్ కానీ.. ప్రూఫ్ కానీ లేదు. అంటే ఇది ఫేక్ న్యూస్ అన్నట్టే గా..!

08.parushuram: పరుశురామ్‌ ఓ టైం వేస్ట్ ఫెలో…

ఎవరైనా ట్రెండింగ్‌లో ఉంటే.. వాళ్లకు సంబంధించిన త్రో బ్యాక్ వీడియోలను పట్టుకొచ్చి మరీ నెట్టింట ట్రెండ్ అయ్యేలా చేస్తుంటారు కొంత మంది. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ రిలీజ్‌తో నెట్టింట ట్రెండ్ అవుతున్న డైరెక్టర్ పరుశురామ్ విషయంలోనూ ఇదే చేశారు. పరుశురాం నా టైం వేస్ట్‌ చేశాడు. అసలు పరుశురామ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ అంటూ.. గతంలో నాగచైతన్య చేసిన సీరియస్ కామెంట్స్‌ను బయటికి తీసి.. మరోసారి నెట్టింట వైరల్ చేస్తున్నారు కొంత మంది నెటిజన్స్.

09. anasuya: విజయ దేవరకొండ బూతు మాటపై అనసూయ రియాక్షన్.

అనసూయ- దేవరకొండ! అర్జున్ రెడ్డి దగ్గర నుంచి మొదలైన వీరి లొల్లి జర్నీ ఆగినట్టే ఆగిపోయి మళ్లీ నెట్టింట ఏదో ఒక రకంగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. వీరిద్దరూ సైలెంట్‌గా ఉన్న వీరి ఫ్యాన్స్ మధ్య చిన్న పాటి యుద్ధానికి దారి తీస్తూనే ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో.. విజయ్‌ దేవరకొండ క్యాజువల్‌గా తన ఫ్యాన్స్‌ను అన్న ఓ బూతు మాట ఇప్పుడు నెట్టింట సెన్సేషనల్ అయింది. “ఇష్టం వచ్చినట్టు వాగడం, తర్వత తెలంగాణ హీరో మీద విషం చిమ్ముతున్నారని PR మాఫియాతో సింపతీ డ్రామాలు చేయడం, ఇందులోకి అనసూయను లాగడం” అని ఓ నెటిజన్‌ vd ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్న బూతు మాటను విమర్శిస్తూ నెట్టింట కామెంట్ పెట్టాడు. ఇక ఆ కామెంట్‌కు అనసూయ రిప్లై ఇచ్చారు. ఎవరు ఏ మాఫియా చేస్తున్నారో నేను చాలా సార్లు చెప్పి వదిలేశా. అంటూ రియాక్టయ్యారు. అంతేకాదు ఈ ట్వీట్‌రూ కూడా వారి స్వార్థానికి వాడుకుంటారంటూ.. VD PR టీంపై ఓ సెటైర్ కూడ వేశారు అనసూయ.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Published on: Apr 06, 2024 09:29 PM