TOP 9 ET: టీజర్ అప్ డేట్ వచ్చిందహో.. | కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్.
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా అప్డేట్స్ మెల్లగా జోరందుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్ర టీజర్ అప్డేట్ బయటికి వచ్చింది. దసరాకు గేమ్ ఛేంజర్ టీజర్ వస్తుందని క్లారిటీ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. దీంతో ఈ టీజర్ పై అంతటా ఆసక్తి నెలకొంది.| సమంత నాగచైతన్య విడాకులకు కేటీఆరే కారణం అంటూ కొండా సురేఖ చేసిన కామెంట్స్ పై కింగ్ నాగ్ సీరియస్ అయ్యారు.
01.Game Changer: టీజర్ అప్ డేట్ వచ్చిందహో…
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా అప్డేట్స్ మెల్లగా జోరందుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్ర టీజర్ అప్డేట్ బయటికి వచ్చింది. దసరాకు గేమ్ ఛేంజర్ టీజర్ వస్తుందని క్లారిటీ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. దీంతో ఈ టీజర్ పై అంతటా ఆసక్తి నెలకొంది.
02.nag serious: కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్.
సమంత నాగచైతన్య విడాకులకు కేటీఆరే కారణం అంటూ కొండా సురేఖ చేసిన కామెంట్స్ పై కింగ్ నాగ్ సీరియస్ అయ్యారు. కొండా సురేఖ వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని.. మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి అంటూ మంత్రికి సూచించారు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి అంటూ సురేఖకి రిక్వెస్ట్ చేశారు. తమ కుటుంబం పై కొండా సురేఖ చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం అంటూ తన ట్వీట్తో క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు తక్షణమే కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కింగ్ నాగ్ కోరారు.
03.prakash raj: సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్నచూపా.?
సినిమా నటుడు ప్రకాశ్రాజ్ ఏపీ నుంచి తెలంగాణ వైపు మళ్లారు. తెలంగాణలో తాజా రాజకీయాలపై ప్రకాష్రాజ్ ట్వీట్ చేశారు. ఏంటీ సిగ్గులేని రాజకీయాలు.. సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్నచూపా? జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్రాజ్ ట్వీట్ చేశారు. మనిషి కనపడకుండానే తన ట్వీట్లతో పొలిటికల్ కాక రేపుతున్న మోనార్క్.. ఇండియాకు తిరిగి వచ్చాక ఇంకా ఎలాంటి బాంబ్స్ పేలుస్తారో చూడాలి.
04.Anushka: గుడ్ న్యూస్ పెళ్లికి రెడీ అయిన అనుష్క?
టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క పెళ్లి వార్తలు మరోసారి వైరల్ అవుతున్నాయి. దుబాయ్కి చెందిన ఓ వ్యాపారవేత్తను త్వరలో అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారన్న న్యూస్ ఫిలిం సర్కిల్స్లో ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం ఘాటీ, కథనార్ సినిమాల షూటింగ్లో బిజీగా ఉన్నారు స్వీటీ.
05.jani: అవార్డు అందుకోవాలి అనుమతివ్వండి ప్లీజ్.. కోర్టుకు జానీ స్పెషల్ రిక్వెస్ట్.!
లైంగిక వేధింపుల కేసులో ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న జానీ మాస్టర్… తాజాగా మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. తనకు ఐదు రోజుల మద్యంతర బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జానీ. తాను నేషనల్ అవార్డు అందుకోవాల్సి ఉందని.. అందుకు గాను 5 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. ఆ పిటిషన్ పై విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది రంగారెడ్డి పోక్సో కోర్టు.
06.Robo: అప్పటి రోబో నుంచి ఇప్పుడు సర్ ప్రైజ్ గిఫ్ట్
రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ రోబో. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా రిలీజయ్యి 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. రజనీ సైంటిస్ట్గా, రోబోగా ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ హీరోయిన్గా నటించారు.
07.Hit 3 : నానితో కేజీఎఫ్ బ్యూటీ
ప్రస్తుతం హిట్ 3 షూటింగ్లో బిజీగా ఉన్నారు యంగ్ హీరో నాని. ఓ వైపు షూటింగ్ చేస్తూనే కాస్టింగ్ కూడా ఫైనల్ చేస్తున్నారు. ఈ సినిమాలో నానికి జోడిగా కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిథి శెట్టి నటిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆమె వైజాగ్ షెడ్యూల్లో పాల్గొన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
08.Jawan: ఇక ఇప్పుడు.. జపాన్ లో జవాన్.!
షారూఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన జవాన్ సినిమా జపాన్లో రిలీజ్ కానుంది. గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా 1150 కోట్ల వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఈ సినిమాను జపనీస్లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. నవంబర్ 29న జపనీస్ వెర్షన్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
09.James Bond: బాండ్ సిరీస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.
బాండ్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పారు ఆ సిరీస్ మేకర్స్. ఇప్పటి వరకు బాండ్ సిరీస్లో తెరకెక్కిన 25 సినిమాలను ఒకే ఓటీటీ ప్లాట్ ఫామ్లో అందుబాటులోకి తీసుకువస్తున్నట్టుగా వెల్లడించారు. అక్టోబర్ 5న బాండ్ డే సందర్భంగా ఈ సినిమాలు స్ట్రీమ్ కానున్నాయి
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.