షూటింగులతో కళకళలాడుతున్న లొకేషన్లు.. చలిలోనూ హీరోల బిజీ

Edited By:

Updated on: Dec 17, 2025 | 3:58 PM

టాలీవుడ్‌లో సినిమా షూటింగ్స్ జోరుగా సాగుతున్నాయి. వణికించే చలిలోనూ మన హీరోలు అస్సలు తగ్గేదేలే అంటున్నారు. మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, నాని, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి తారలు వివిధ స్టూడియోలు, లొకేషన్లలో తమ సినిమాల చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. తాజా షెడ్యూల్స్, ప్రముఖ హీరోల ప్రస్తుత షూటింగ్ వివరాలను ఈ ప్రత్యేక కథనంలో చూడండి.

టాలీవుడ్‌లో షూటింగ్స్ హడావిడి మామూలుగా లేదు.. వణికించే చలిలోనూ వరస షూటింగ్స్ చేస్తూ అస్సలు తగ్గేదేలే అంటున్నారు మన హీరోలు. ఒకరిద్దరు మినహాయిస్తే.. మిగిలిన హీరోలంతా కెమెరా ముందే బిజీ అయ్యారు. మరి ఏ సినిమా షూట్ ఎక్కడ జరుగుతుంది.. ఏ హీరో ఎక్కడున్నాడో ఈ రోజు షూటింగ్స్ స్పెషల్ ప్యాక్‌లో చూద్దామా..? షూటింగ్ ప్యాక్‌లో ముందుగా హెలో నేటివ్ స్టూడియోలో ఏం జరుగుతున్నాయో చూద్దాం..! నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ప్యారడైజ్‌తో పాటు.. శ్రవణ్ హీరోగా ఎమ్మెస్ రాజు తెరకెక్కిస్తున్న సినిమా, శర్వానంద్ భోగి సినిమాల షూటింగ్స్ హెలో నేటివ్‌లో జరుగుతున్నాయి. ఇక మహేష్ బాబు వారణాసి, ప్రభాస్ ఫౌజీ, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాల షూటింగ్స్ RFCలో జరుగుతున్నాయి. చిరంజీవి, అనిల్ రావిపూడి మనశంకరప్రసాద్ గారు షూటింగ్ ఇప్పటికే పూర్తైంది.. అన్నపూర్ణ 7 ఎకర్స్‌లో చిన్న ప్యాచ్ వర్క్స్ జరుగుతున్నాయి. అల్లు అర్జున్ AA22 షూట్ ముంబైలో.. రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి షూట్ జనవాడలో జరుగుతున్నాయి. రామ్ చరణ్ పెద్ది షూటింగ్ కొన్ని రోజులుగా కోఠిలో జరుగుతుంది. విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ కాంబోలో వస్తున్న సినిమా షూటింగ్ 2 వారాలుగా అల్యూమీనియం ఫ్యాక్టరీలోనే జరుగుతుంది. సూర్య, వెంకీ అట్లూరి సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరిదశకు వచ్చేసింది. ఇక అఖిల్ అక్కినేని లెనిన్ షూట్ బూత్ బంగ్లాలో జరుగుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??

Vijayawada: బెజవాడ రైల్వే స్టేషన్‌లో పార్కింగ్‌ దోపిడీ

డీమాన్‌ని ఢీ కొట్టి బొక్కబోర్లా పడ్డ కళ్యాణ్.. తనూజ దెబ్బకు షాక్‌లోకి

Pawan Kalyan: పవన్‌ డ్యాన్స్‌ ఎఫెక్ట్‌ షేక్ అవుతున్న సోషల్ మీడియా..

Akhanda 2: అఖండ2 థియేటర్లో అఘోరాలు.. వైరల్‌గా వీడియో..

Published on: Dec 17, 2025 03:42 PM