చిరు, బాలయ్య ఓ వైపు.. వెంకటేష్, నాగ్ మరోవైపు
టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఫుల్ జోష్‌లో ఉన్నారు. వయసు కేవలం ఓ నంబర్ అని నిరూపిస్తూ, యువ హీరోలకు దీటుగా దూసుకుపోతున్నారు. వీరిలో చిరంజీవి, బాలకృష్ణ పూర్తిగా మాస్ చిత్రాల వైపు మొగ్గు చూపుతుండగా, వెంకటేష్, నాగార్జున తమకు బాగా కలిసొచ్చిన క్లాస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లను ఎంచుకుంటున్నారు. వారి భవిష్యత్ ప్రాజెక్టులు ఈ వైవిధ్యాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి.
టాలీవుడ్‌లో ఉన్న సీనియర్లు నలుగురు.. అందులో చిరంజీవి, బాలయ్య కలిసిపోయారిప్పుడు.. వెంకటేష్, నాగార్జున మరో జట్టుగా విడిపోయారు. మీ దారి మీదే.. మా దారి మాదే అంటున్నారు వాళ్లు. ఇప్పుడు జరుగుతున్నదిదే.. చిరు, బాలయ్య ఓ దారిలో వెళ్తుంటే.. మా రూటే వేరు అంటూ నాగ్, వెంకీ మరో దారి ఎంచుకున్నారు. మరి వీళ్ళ దారేంటో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..? జోనర్స్ ఏవైనా టాలీవుడ్‌లో నలుగురు సీనియర్లు మాత్రం ఫుల్ జోష్ మీదున్నారిప్పుడు. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అంటూ.. కుర్ర హీరోలు కూడా కుళ్లుకునేలా స్పీడ్ చూపిస్తున్నారు. ఓ వైపు చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారుతో బ్లాక్‌బస్టర్ కొడితే.. వెంకీ ఆల్రెడీ ఫామ్‌లోనే ఉన్నారు. బాలయ్య, నాగార్జున కూడా తగ్గేదే లే అంటున్నారు. మన సీనియర్లు రెండు టీమ్స్‌గా విడిపోయారిప్పుడు. అర్థం కాలేదు కదా.. డీటైల్డ్‌గా మాట్లాడుకుంటే మ్యాటర్ చాలా సింపుల్. నలుగురులో చిరు, బాలయ్య పూర్తిగా మాస్ రూట్ తీసుకున్నారు.. ఇక వెంకీ, నాగార్జున క్లాస్‌గా తమకి బాగా కలిసొచ్చిన ఫ్యామిలీ రూట్ వైపు వెళ్తున్నారు. త్రివిక్రమ్ తర్వాత మరోసారి తన లక్కీ డైరెక్టర్ అనిల్ రావిపూడితోనే సినిమా చేయబోతున్నారు వెంకీ మామ. నాగార్జున ప్రస్తుతం 100వ సినిమాతో బిజీగా ఉన్నారు. రా కార్తిక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మాఫియా నేపథ్యంలో వస్తుందని తెలుస్తుంది. దీని తర్వాత కళ్యాణ్ కృష్ణ కురసాలతో సోగ్గాడే చిన్నినాయనా ఫ్రాంచైజీలో మూడో పార్ట్ చేయబోతున్నారు. సంక్రాంతికి వస్తున్నాం అంటూ 2027, జనవరి 15 డేట్ కూడా లాక్ చేసుకున్నారు ఈ బంగార్రాజు. బాబీతో ఎమోషనల్ యాక్షన్ సినిమా ప్లాన్ చేస్తున్న చిరంజీవి.. నెక్ట్స్ శ్రీకాంత్ ఓదెలతో ప్యూర్ మాస్ ర్యాంపేజ్‌కు రెడీ అవుతున్నారు. ఇక బాలయ్య అయితే గోపీచంద్ మలినేనితో పూనకాలు పుట్టించేందుకు సై అంటున్నారు. ఆ తర్వాత హరీష్ శంకర్‌తోనూ మాస్ సినిమానే ఉండబోతుంది. ఇలా చిరు, బాలయ్య మాస్ వైపు వెళ్తుంటే.. వెంకీ, నాగ్ వి వాంట్ ఫ్యామిలీ మూవీస్ అంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jr NTR: ఎన్టీఆర్ సినిమాలో అతిథిగా ఆ స్టార్ హీరో.. బాబోయ్.. ఇక రచ్చ.. రోబోల..
Tollywood News: ఈటీ ఎక్స్‌క్లూజివ్.. మరిన్ని అప్‌డేట్స్
ఈ సమ్మర్.. పాపం ఆ హీరోయిన్లకు పెద్ద పరీక్షే