AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sankranti 2024 Movies: ఎవరో ఒకరు వెన్నక్కి తగ్గాలి.! సంక్రాంతి మూవీస్ పై దిల్ రాజు షాకింగ్ కామెంట్స్

Sankranti 2024 Movies: ఎవరో ఒకరు వెన్నక్కి తగ్గాలి.! సంక్రాంతి మూవీస్ పై దిల్ రాజు షాకింగ్ కామెంట్స్

Anil kumar poka
|

Updated on: Dec 27, 2023 | 12:01 PM

Share

ఈసారి సంక్రాంతి పండక్కి సినిమాల జాతర ఉండబోతుంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు భారీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. దీంతో ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యేందుకు సిద్దం కావడం వివాదాస్పదంగా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న గుంటూరు కారం, వెంకటేశ్.. సైంధవ్, రవితేజ.. ఈగల్, తేజ సజ్జా హనుమాన్, నాగార్జున నటిస్తోన్న నా సామిరంగ సినిమాలు ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతుండడంతో థియేటర్ల సర్దుబాటు కష్టంగా మారింది.

ఈసారి సంక్రాంతి పండక్కి సినిమాల జాతర ఉండబోతుంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు భారీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. దీంతో ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యేందుకు సిద్దం కావడం వివాదాస్పదంగా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న గుంటూరు కారం, వెంకటేశ్.. సైంధవ్, రవితేజ.. ఈగల్, తేజ సజ్జా హనుమాన్, నాగార్జున నటిస్తోన్న నా సామిరంగ సినిమాలు ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతుండడంతో థియేటర్ల సర్దుబాటు కష్టంగా మారింది. ఇటు నిర్మాతలెవరూ వెనక్కి తగ్గకపోవడంతో సంక్రాంతి సినిమాల వివాదంపై నిర్మాత, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు స్పందించారు.

ఇటీవల ఫిల్మ్ ఛాంబర్​లో ఆ ఐదు సినిమాల నిర్మాతలతో చర్చలు జరిపినట్లు చెప్పిన దిల్ రాజు… సంక్రాంతి రేసు నుంచి రెండు సినిమాలు తప్పుకుంటే థియేటర్లు సర్దుబాటు చేయడం సులభం అవుతుందని అన్నారు. ఇప్పుడు సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నవారికి ఆ తర్వాత సోలో రిలీజ్ డేట్ ఛాంబర్ తరఫున ఇస్తామని ఐదుగురు నిర్మాతలకు చెప్పినట్టు దిల్‌ రాజు వెల్లడించారు. గుంటూరు కారం నిర్మాతలు మినహా మిగతా నిర్మాతల్లో ఎవరో ఒకరు వెనక్కి తగ్గితే అందరికీ లాభదాయకంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

సంక్రాంతికి ఐదు భారీ చిత్రాలు విడుదలైతే ఏ సినిమాకు న్యాయం జరగదని అన్నారు దిల్ రాజు. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించనున్నట్లు తెలిపారు. ఇటీవలే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిశామని, సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు దిల్‌ రాజు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.