నవంబర్‌లో సినిమాల జాతర.. నాలుగు వారాల్లో 21 సినిమాలు..మరి విజేతలుగా నిలిచేదెవరు?

Edited By:

Updated on: Nov 09, 2026 | 6:12 PM

దీపావళి సినిమాల జోష్‌ కొనసాగుతుండగా నవంబర్‌లో టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ మరింత సందడిగా మారనుంది. నాలుగు వారాల్లో ఏకంగా 21 సినిమాలు థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ‘భోగి’, ‘ఆకాశంలో ఒక తార’, ‘ఈఎన్ఈ రిపీట్‌’, ‘హైందవ’, ‘మైసా’ వంటి క్రేజీ ప్రాజెక్టులతో పాటు చిన్న సినిమాలు, డబ్బింగ్‌ చిత్రాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఒకే నెలలో ఇన్ని విడుదలలతో థియేటర్లలో పోటీ పెరగనుంది.

దీపావళి బరిలో రిలీజైన సినిమాలకు పాజిటివ్ టాక్ రావడంతో టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఇప్పుడు ఇదే జోష్‌ను కంటిన్యూ చేసేందుకు నవంబర్ నెల రెడీ అవుతోంది. వెండితెర మీద మోస్ట్ హెక్టిక్ మంథ్‌గా మారబోతున్న నవంబర్‌లో నాలుగు వారాల్లో ఏకంగా 21 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. క్రేజీ ప్రాజెక్ట్స్, సీక్వెల్స్‌తో పాటు వరుస డబ్బింగ్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాయి. సాధారణంగా పండుగ సీజన్ ముగిశాక నవంబర్‌ను కాస్త డల్ సీజన్‌గా భావిస్తుంటారు. కానీ ఈసారి మాత్రం బాక్సాఫీస్ లెక్కలు పూర్తిగా మారిపోయాయి. ప్రతి వారం ఐదుకు పైగా సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. ముఖ్యంగా భోగి, ఆకాశంలో ఒక తార, ఈఎన్ఈ రిపీట్‌, హైందవ, మైసా లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఆడియన్స్‌లో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. క్రేజీ సినిమాలతో పాటు కంటెంట్ ఓరియెంటెడ్ చిన్న సినిమాలు కూడా ఈ నెలలో గట్టిగానే పోటీ పడుతున్నాయి. గోట్‌, అ, డీఎన్‌కే, మాయ లేడీ, ఇట్లు అర్జున లాంటి సినిమాలు యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తున్నాయి. వీటితో పాటు చంద్రయాన్‌, డార్క్ చాక్లెట్‌, రోమియో జూలియట్‌, హై మూవీస్‌ వెరైటీ టైటిల్స్, డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఇక స్ట్రెయిట్ తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాల హవా కూడా ఈ నాలుగు వారాల్లో జోరుగా కనిపించబోతోంది. రామాయణ, సీన్‌, మహాశక్తి సినిమాలు ఇప్పటికే ఆడియన్స్‌ ముందుకు వచ్చేశాయి. నాన్న కుట్టి, ఓం, సత్యవన్ సావిత్రి సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. అయితే ఒకే నెలలో 21 సినిమాలు రిలీజ్ అవుతుండటంతో థియేటర్ల ఎలా సర్దుకుంటారో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ.40 కోట్లు ఇస్తేనే ఉంటాం.. స్టార్ ప్లేయర్ల భారీ డిమాండ్

కాశీలో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్.. దేశంలోనే తొలి పబ్లిక్‌ రోప్‌వే సిద్ధం

ఆటో ఎక్కితే అంతే సంగతులు.. మహిళలే టార్గెట్

విమానయాన రంగంలో కొత్త శకం.. 90 ఏళ్ల నాటి చట్టం రద్దు

రాపిడో డ్రైవర్‌తో ప్రేమలో పడిన యువతి.. వైరల్ లవ్ స్టోరీ!

Loading...
Unable to load recommendations.
Follow Us