వరుస సినిమాలు చేస్తున్న.. కష్టానికి తగ్గ ఫలితం లేదు.. ఒక్క హిట్ ప్లీజ్

Edited By:

Updated on: Dec 22, 2025 | 5:01 PM

ఇండస్ట్రీలో విజయం సాధించడానికి అందం ఒక్కటే సరిపోదు, అదృష్టం కూడా ఉండాలని ఈ కథనం వివరిస్తుంది. భాగ్యశ్రీ బోర్సే, కావ్య థపర్, సాయి మంజ్రేకర్, నిధి అగర్వాల్, నభా నటేష్ వంటి హీరోయిన్లు గ్లామర్ ఉన్నా సరైన సక్సెస్ లేక కెరీర్‌లో సతమతమవుతున్నారు. అవకాశాలు వస్తున్నా హిట్స్ లేకపోవడంతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అదృష్టం కలిసిరాకపోవడంతో ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండదని ఈ కథనం స్పష్టం చేస్తుంది.

ఇండస్ట్రీలో హీరోయిన్‌గా సక్సెస్ అవ్వాలంటే.. అందం మాత్రమే ఉంటే సరిపోదు అదృష్టం కూడా ఉండాలి. పాపం అది లేకే కొందరు హీరోయిన్ల కెరీర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. సినిమాలు చేస్తున్నారు కానీ ఏ ప్రయోజనం లేదు. వస్తున్నారు.. పోతున్నారు అన్నట్లే ఉంది గానీ ఇండస్ట్రీలో ఎఫెక్ట్ అయితే చూపించట్లేదు వాళ్లు. ఇంతకీ ఎవరా హీరోయిన్లు..? భాగ్యశ్రీ బోర్సేకి టైమ్ అస్సలు కలిసిరావట్లేదు. మిస్టర్ బచ్చన్‌తో పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత కింగ్డమ్, కాంతా, ఆంధ్రా కింగ్ తాలూకలో నటించారు. కానీ ఇందులో ఏ ఒక్కటీ సక్సెస్ కాలేదు. రామ్ సినిమాకు టాక్ బానే వచ్చినా డబ్బులు రాలేదు. ప్రస్తుతం ఈమె ఆశలన్నీ అఖిల్ లెనిన్ సినిమాపైనే ఉన్నాయి. ఇక కావ్య థపర్ కూడా డబుల్ ఇస్మార్ట్, ఈగల్, విశ్వంలో నటించినా ఫలితం శూన్యమే. సాయి మంజ్రేకర్ పరిస్థితీ అంతే. మేజర్‌తో మంచి హిట్ కొట్టిన ఈ భామకు ఆ తర్వాత మళ్లీ హిట్ లేదు. వరుణ్ తేజ్ గని, రామ్ పోతినేని స్కంద దారుణంగా బోల్తా కొట్టాయి. ఈ ఏడాది వచ్చిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి కూడా ఫ్లాపే. గ్లామర్ షో ఎంత చేస్తున్నా సాయి మంజ్రేకర్‌కు ఒరిగిందేమీ లేదు. ప్రస్తుతం నిఖిల్ నటిస్తున్న ది ఇండియా హౌజ్ ఈమెకు లాస్ట్ ఆప్షన్. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్‌ను పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేకపోయారు. ప్రస్తుతం ఈమె ఆశలన్నీ రాజా సాబ్‌పైనే ఉన్నాయి. జనవరి 9న రానున్న ఈ చిత్రం కోసం బాగా కష్టపడుతున్నారు నిధి. ఓ వైపు ప్రమోషన్స్.. మరో వైపు ఇంటర్వ్యూస్ అంటూ క్షణం తీరికలేకుండా చెమటోడుస్తున్నారు. మరో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సైతం కొన్నేళ్లుగా వరస ఫ్లాపులతో సతమతమవుతున్నారు.. ఈమెను మరిచిపోయే స్టేజ్‌లో ఉన్నారు ఆడియన్స్. ప్రస్తుతం నిఖిల్ స్వయంభుతో కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. మొత్తానికి గ్లామర్ షోతో మాత్రమే ఇండస్ట్రీలో స్టార్స్ అవ్వరు అనడానికి ఈ హీరోయిన్లే నిదర్శనం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

T20 వరల్డ్‌కప్‌కు టీమిండియా ఆటగాళ్లు వీరే

అర్ధరాత్రి కారు బీభత్సం.. ఆ తర్వాత

అద్భుతం.. పద్మావతి అమ్మవారికి పసుపు కొమ్ముల అలంకరణ

చంపేస్తోన్న చలి.. అత్యల్ప ఉష్ణోగ్రతలో సరికొత్త రికార్డ్‌

కొడుకు సమాధి వద్ద సీసీ కెమెరా ఏర్పాటు.. ఎందుకో తెలిస్తే..