స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి! ట్యాలెంటెడ్ డైరెక్టర్ ఆకస్మిక మృతి!
టాలీవుడ్ దర్శకుడు కిరణ్ కుమార్ (KK) అకాల మరణం ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన దర్శకత్వం వహిస్తున్న 'KJQ' సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉండగా, ఈ విషాదం చోటుచేసుకుంది. గతంలో నాగార్జున హీరోగా 'KD' చిత్రాన్ని తెరకెక్కించిన కిరణ్ కుమార్, మణిరత్నం వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు నివాళులర్పించారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. దర్శకుడు కిరణ్ కుమార్ అర్థాంతరంగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. టాలీవుడ్‌లో దర్శకుడిగా నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్న కిరణ్.. ప్రస్తుతం ‘KJQ- కింగ్ – జాకీ – క్వీన్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తయిపోయిన ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది. ఈ క్రమంలోనే ఈ మూవీ డైరెక్టర్ కిరణ్ కుమార్ అలియాస్ కేకే మరణించడం KJQ టీంతో పాటే.. టాలీవుడ్‌ను షాకయ్యేలా చేసింది. ఇక కిరణ్ కుమార్ 2010లో డైరెక్టర్‌గా మారాడు. కింగ్ నాగార్జున హీరోగా కేడీ సినిమాను తెరకెక్కించాడు. అయితే గ్యాంబ్లింగ్ అండ్ మాఫియా నేపథ్యంలో సాగే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దీంతో డైరెక్టర్‌గా గ్యాప్ తీసుకున్న కిరణ్ కుమార్ ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా కీ రోల్ పోషించారు. ఈక్రమంలోనే విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భద్రకాళి’ సినిమాలో సిబిఐ ఆఫీసర్ పాత్రలో అందర్నీ ఆకట్టుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఈయన బిజీ అవుతాడని అందరూ అనుకున్నటైంలోనే.. డైరెక్టర్ గా KJQ సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ సినిమా పనుల్లో బిజీగా ఉండగా.. ఆయన మరణించారనే న్యూస్ బయటికి వచ్చింది. అయితే ఎలా మరణించారనేది మత్రం ఇంకా తెలియాల్సి ఉంది. కెకె హఠాన్మరణంతో సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. కిరణ్ కుమార్ మరణవార్త తెలిసి పలువురు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
