Top 5 ET : చిరు సంచలన నిర్ణయం.. మనోడితోనే మొదలు.. తమ్ముడి గురించి సుష్మిత వెయిటింగ్.. 

Updated on: Jan 31, 2026 | 9:58 PM

వారణాసి సినిమా రిలీజ్‌కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వేళ... రాజమౌళి నుంచి అఫీషియల్ డేట్ కన్ఫర్మ్ అయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా వారణాసి సినిమాను విడుదల చేయనున్నట్లు పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి ట్వీట్ చేశాడు. దాంతో పాటే ప్రత్యేక పోస్టర్‌ను కూడా పంచుకున్నాడు.

ఆఫ్టర్ మన శంకర వర ప్రసాదు సినిమా సక్సెస్‌తో ఫుల్ జోష్‌ మీదున్న మెగాస్టార్ చిరు.. ఇప్పుడు ట్రెండ్‌ను ఫాలో అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ పాడ్ కాస్ట్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారట చిరు. నాలుగు దశాబ్దాల తన సినీ రంగ ప్రయాణంలోని సంగతులను, విశేషాలను , తన అనుభవాలను.. ఈ తరానికి తన గొంతుతో వినిపించాలని చిరు చూస్తున్నారట . ఇందుకు పాడ్ కాస్ట్ అయితే బెస్ట్ వేదికని ఆయన డిసైడ్ అయ్యారని.. ఇందుకోసం మెగా సుస్మిత ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టారని ఇన్‌ సైడ్ టాక్.

మన శంకర వర ప్రసాదు గారితో.. తన తండ్రికి బిగ్గెస్ట్ హిట్ నివ్వడమే కాదు.. ప్రొడ్యూసర్‌గా తనను తాను నిరూపించుకున్నారు సస్మిత. ఈక్రమంలోనే ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన ఈమె.. రామ్ చరణ్ తో సినిమా గురించి నోరు విప్పారు. తన తమ్ముడు చరణ్ ఇప్పుడు చాలా పెద్ద స్టార్‌ అని చెప్పిన సుస్మిత… చాలా మంది ప్రొడ్యూసర్స్‌లాగే.. తాను కూడా తనతో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాని చెప్పారు. అంతేకాదు అందుకోసం తాను కూడా క్యూలో ఉన్నట్టు నవ్వేశారు.