TOP 9 ET News: స్పిరిట్ లో చిరు.. పక్కా సమాచారం..?
పాన్ ఇండియా లెవల్లో మోస్ట్ ఎలిజిబిబుల్ బ్యాచిలర్ గా ట్యాగ్ తెచ్చుకున్న ప్రభాస్ పెళ్లి... ఏకంగా హీరోయిన్ అనుష్కతో జరిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎస్ ! AI టెక్నాలిజీతో ఎన్నో కనికట్లు చేస్తున్న కొంత మంది నెటిజన్లు.. ఇప్పుడు ఏకంగా ప్రభాస్- అనుష్క పెళ్లి చేశారు. మిగిలిన మన స్టార్ హీరోలు.. వీళ్లిద్దరి పెళ్లిలో తలో పని చేస్తున్నట్టు గా AI సాయంతో వీడియోను మలిచారు. అయితే ఈ వీడియో నవ్వుకోడానికి బానే ఉన్నా కానీ.. ఫ్యూచర్లో AIతో తీవ్ర సమస్యలు తప్పవనే స్పృహ అందరికీ కలిగిస్తోంది. అందులోనూ సెలబ్రిటీలు Ai నుంచి తీవ్ర సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందనే కామెంట్ వస్తోంది.
స్పిరిట్ లో ప్రభాస్ పక్కన మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేస్తున్నాడని.. రెబల్ స్టార్ ప్రభాస్ కు తండ్రిగా క్యామియో ఇస్తున్నారన్న టాక్.. ఇప్పుడు కూడా ఈ మూవీ విషయం బయటికి వచ్చినప్పటి నుంచే వినిపిస్తోంది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మెగాస్టార్ చిరు ఫ్యాన్ కావడం, అందులోను స్పిరిట్ ఓపెనింగ్ కు చిరు రావడం ఈ వార్తలకు బలం చేకూర్చాయి.అయితే ఈ న్యూస్ పై స్పిరిట్ టీం ఓ క్లారిటీ ఇచ్చింది. స్పిరిట్‌లో మెగాస్టార్ చిరు నటిస్తున్నాడన్నది.. పక్కా ఫేక్ అని చెప్పింది. అసలు అలాంటి ప్రతిపాదనే లేదని సోషల్ మీడియాలో వినిపిస్తున్నవన్నీ ఫేక్ న్యూస్ అని చెప్పేసింది. అంతేకాదు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా రెగ్యులర్ షూట్ ను స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు.. డిసెంబరులో ప్రభాస్ ఈ సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు ఇన్‌సైడ్ టాక్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kaantha OTT: అప్పుడే OTTలోకి కాంతా మూవీ
ఎటు చూసినా నీళ్లే.. శ్రీలంకను ముంచిన వరుణుడు
చనిపోయిన తల్లిలా వేషం వేసిన కొడుకు.. మూడేళ్లుగా రూ. 80 లక్షల పింఛను కోసం నాటకం
Hongkong: అపార్ట్‌మెంట్లలో అగ్నికీలలు పన్నెండు మంది మృతి.. లోపలే చిక్కుకున్న వందలాది మంది
చెవిపోగులు తాకట్టు పెట్టింది.. కట్ చేస్తే కటిక పేదరికం నుండి పెద్ద ధనవంతురాలు అయ్యింది
