TOP 9 ET News: డబుల్‌ కా మీటా! ఇది కదా బర్త్‌ డే బంప్స్‌ అంటే!

Updated on: Mar 27, 2025 | 2:08 PM

సాధారణంగా బర్త్‌ డే రోజు.. ఎవరైతే బర్త్‌ డే చేసుకుంటారో.. వారికే బర్త్‌ డే బంప్స్‌ ఇస్తారు. వారి బర్త్‌ డేను ఎప్పుటికీ గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేస్తారు. కానీ ఇక్కడ రివర్స్‌లో మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్‌.. తన ఫ్యాన్స్‌కు బర్త్‌ డే బంప్స్‌ ఇచ్చారు. ఓ పక్క తన RC16 సినిమా నుంచి తన బ్యాక్ లుక్ పోస్టర్‌ను రిలీజ్‌ చేసిన చెర్రీ.. ఫ్రంట్ లుక్ తో రచ్చ చేయడం పక్కా అనే హింట్ ఇచ్చాడు.

మరో పక్క గేమ్‌ ఛేంజర్ తో ఓటీటీ ఫీల్డ్‌లో దూసుకుపోతున్నాడు చెర్రీ. థియేటర్లో వర్కవుట్ కానీ ఈ సినిమా ఓటీటీలో మాత్రం దూసుకుపోతోంది. ఏకంగా 250 మిలియన్ స్ట్రీమింగ్ మినెట్స్‌ను సాధించింది. తొలి రోజు నుంచి ఇప్పటి వరకు జీ5 ఓటీటీలో టాప్‌ 10 లో ట్రెండ్ అవుతోంది మెగా పవర్ స్టార్ మూవీ. తెలివి మీరిన లీకర్స్‌ను .. స్పాయిలర్స్‌ను బీట్ చేయడానికి ఇప్పుడు మన స్టార్ హీరోలు, మేకర్లు గల్ఫ్‌ దేశాలకు పయనమవుతున్నారు. అక్కడ ఈజీగా దొరుకుతున్న ప్రైవెసీ అండ్ సెక్యూరిటీతో.. కంఫర్ట్‌ గా తమ అప్‌కమింగ్ ప్రాజెక్ట్‌ల గురించి మాట్లాడుకుంటున్నారు. తమ ప్లాన్స్‌ అండ్ పాలసీస్‌ గురించి చర్చిస్తున్నారు. ఆ మధ్య మెగా పవర్ స్టార్ రామ్‌ , సుక్కు సినిమా డిస్కషన్స్‌ కోసమే దుబాయ్ వెళ్లారు. ఆ న్యూస్‌తో వైరల్ అయ్యారు. ఇక రెండు రోజుల క్రితం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ కూడా అట్లీ సినిమా గురించి మాట్లాడేందుకు దుబాయ్‌నే ఎంచుకున్నారు. ఇలా గల్ఫ్‌ దేశాల్లో సీక్రెట్ సమావేశాలు పెట్టుకుంటూ.. చాలా సీక్రెట్ మెయిన్‌టేన్ చేస్తున్నారు మన స్టార్ హీరోలు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Court: సంచలనంగా కలెక్షన్స్‌.. రూ.50 కోట్ల క్లబ్‌లో కోర్టు మూవీ

Manchu Lakshmi: ఓ ఫ్యామిలీని బాధపెట్టారు.. క్షమాపణలు చెప్పాల్సిందే..