TOP 9 ET News: ప్రభాస్ రూ.3500 కోట్లు..ఫిల్మ్ ఫెటర్నిటీలో ఒకే ఒక్కడు

Updated on: Oct 24, 2025 | 4:20 PM

ఈ మధ్య తన మ్యూజిక్‌ను కాపీ చేశారనే కారణంతో.. తరుచుగా కోర్టు మెట్లుక్కుతున్న ఇళయరాజా.. ఇప్పుడు డ్యూడ్‌ సినిమా టీంకు కూడా బిగ్ స్ట్రోక్ ఇచ్చాడు. ఈ మూవీలో తన అనుమతి లేకుండా తన మ్యూజిక్ ను ఉపయోగించారంటూ.. మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు. కరుత్తి మచ్చా సాంగ్‌తో పాటు మరో సాంగ్‌ను కూడా తన అనుమతి లేకుండా డ్యూడ్‌ సినిమాలో వాడుకున్నారంటూ మేకర్స్ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు ఈయన.

ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలో నెంబర్ 1 పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్న ప్రభాస్‌.. ఇప్పుడు తన సినిమా లైనప్స్‌తో వాటి బడ్జెట్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాడు. ప్రస్తుతం రాజా సాబ్‌, ఫౌజీ సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఇవి కాకుండా.. స్పిరిట్, కల్కి పార్ట్ 2 సినిమాలు ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్నాయి. ఇక సలార్ పార్ట్ 2 మైత్రీ మూవీ మేకర్స్‌తో ఒక సినిమా.. లోకేష్ కనగరాజ్‌, హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో మరో సినిమా కూడా చర్చల్లో ఉంది. ఇలా సాలిడ్ లైనప్‌తో బిజీగా ఉన్న ప్రభాస్‌…ఈ అన్ని సినిమాల బడ్జెట్ కలిపితే దాదాపు 3500 కోట్లకు పైగా అవుతోందనే టాక్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాడు. ఇంత భారీ లైన్‌అప్‌తో ఉన్న హీరో భారతీయ సినిమా చరిత్రలో ఇదే తొలిసారి అనే కామెంట్ వచ్చేలా చేసకుంటున్నాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Renu Desai: మీకు దండం పెడతాను.. ఇలాంటి వార్తలు వద్దు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..