అన్ని ఇండస్ట్రీలు కవర్ చేస్తున్న ముగ్గురు హీరోయిన్లు
కొందరు సౌత్ హీరోయిన్లు కేవలం ఒకే ఇండస్ట్రీకి పరిమితం కాకుండా, పలు భాషల్లో జెండా పాతేస్తున్నారు. రుక్మిణీ వసంత్, మమితా బైజు, కయాదు లోహర్ లాంటి అందగత్తెలు తమ సొంత పరిశ్రమలతో పాటు పక్క ఇండస్ట్రీల్లోనూ పాగా వేసి, మోస్ట్ వాంటెడ్ తారలుగా మారిపోతున్నారు.
కొంతమంది హీరోయిన్లకు సినీ పరిశ్రమలో ఆల్ యాక్సెస్ పాస్ దొరికినట్లుంది. వీరు కేవలం ఒక్క ఇండస్ట్రీతో సరిపెట్టుకోకుండా, అన్ని భాషల్లోనూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. సొంత ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూనే, పక్క భాషల్లోనూ పాగా వేయడానికి పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. రుక్మిణీ వసంత్, మమితా బైజు, కయాదు లోహర్ వంటి సౌత్ హీరోయిన్లు ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీల్లోనూ మోస్ట్ వాంటెడ్ తారలుగా మారిపోయారు. రుక్మిణీ వసంత్ కన్నడలో టాక్సిక్, తెలుగులో డ్రాగన్ చిత్రాలతో అలరిస్తూనే, మలయాళంలో నవీన్ పౌలీ 51వ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికయ్యారు. కొత్త దర్శకుడు నషీద్ మహమూద్ తెరకెక్కించనున్న ఈ చిత్రంలో ఆమె నవీన్‌కు జోడీగా నటిస్తున్నారు. వెరీ స్పెషల్ ఫస్ట్ అంటూ తన మలయాళ ఎంట్రీ గురించి రుక్మిణీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరోవైపు, మమితా బైజు తమిళంలో విష్ణునాథన్ సన్స్‌తో ట్రెండ్ అవుతున్నారు. సొంత భాష మలయాళంలో వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఆమె తెలుగు డెబ్యూ కోసం ఎదురుచూస్తున్నారు. కయాదు లోహర్ విషయానికి వస్తే, ఆమె కన్నడ మినహా అన్ని సౌత్ భాషల్లో తన సత్తా చాటుకుంటున్నారు. తెలుగులో ప్యారడైజ్ లాంటి క్రేజీ సినిమాలో నటిస్తున్న కయాదు, తమిళంలో ఇమ్మోర్టల్, సూర్య 48, మలయాళంలో తారం, దుల్కర్ సల్మాన్‌తో ఐ యామ్ గేమ్ వంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. మొత్తానికి, ఈ ముగ్గురు బ్యూటీల దూకుడు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంట్లో చోరీకి వచ్చి ఆ దొంగ చేసిన పనికి.. నవ్వకుండా ఉండలేరు!
రోడ్డు పై పులి ప్రత్యక్షం.. సెల్ఫీల కోసం ఎగబడిన జనం
హాస్టల్‌లో దెయ్యం..! భయంతో ఖాళీ చేసి వెళ్లిపోయిన విద్యార్ధినిలు
