కళ్యాణ్ ప్రైజ్ మనీలో భారీ కోత.. రూ.35 లక్షలు కాదు వీడియో

Updated on: Dec 26, 2025 | 1:41 PM

బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీ గెలిచిన వాళ్లకి రూ.50 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నామని చాలా గట్టిగా అనౌన్స్ చేశారు హోస్ట్ నాగార్జున. దీంతో హౌస్‌ మేట్స్‌ అందరూ షాకయ్యారు. కింగ్ అనౌన్స్ చేసిన నెంబర్‌కి మురిపోయారు. కొడితే జీవితం సెట్టు అనుకున్నారు. కానీ బ్రీఫ్‌ కేస్ కాన్సెఫ్ట్ తో ఫ్రైజ్‌ మనీ కాస్తా తగ్గిపోయింది. బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌లో డెమాన్ పవన్ రూ.15 లక్షల బ్రీఫ్ కేసు తీసుకుని తెలివైన నిర్ణయంతో బయటకు వచ్చాడు.

దీంతో విన్నర్ ప్రైజ్ మనీలో ఆ 15 లక్షలు మినహా యించగా.. ట్రోఫీ గెలుచుకున్న కళ్యాణ్ పడాలకి రూ.35 లక్షలు ప్రైజ్ మనీ చెక్ అందించారు నాగ్. దాంతో పాటు.. ఓ కారు, మరో ఐదు లక్షల ఓచర్‌ని కూడా అందించారు. అయితే కళ్యాణ్ అందుకున్న ఆ రూ.35 లక్షల్లో భారీకోత పడకతప్పదని తెలుస్తోంది. అతని ప్రైజ్ మనీ రూ.35 లక్షల్లో జీఎస్టీ మినహాయిస్తే.. చేతికి వచ్చేది రూ.16.01 లక్షలు మాత్రమేనట. కేవలంఈ ప్రైజ్ మనీ మాత్రమే కాదు.. తనకు వచ్చిన మారుతి కారుకు కూడా.. కళ్యాణ్ జీఎస్టీ చెల్లించాల్సిందే. అయితే కళ్యాణ్‌కి ఇచ్చిన మరో రూ.5 లక్షల ఓచర్‌కి మాత్రం జీఎస్టీ లేకపోవచ్చు. ఎందుకంటే.. అది నగదు రూపంలో కాదు కాబట్టి.

మరిన్ని వీడియోల కోసం :

2025లో చక్ దే ఇండియా..వీడియో

వాళ్లకు ప్రమోషన్ పాఠాలు నేర్పిస్తున్న స్టార్ డైరెక్టర్ వీడియో

చిరంజీవి సినిమాలో మలయాళ సూపర్ స్టార్? వీడియో

మార్పు మంచిదే అంటున్న అనన్య పాండే వీడియో