The Raja saab: ఫ్యాన్స్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న రాజాసాబ్ టీమ్‌

Updated on: Dec 16, 2025 | 4:36 PM

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ది రాజాసాబ్ సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. ఇందులో ప్రభాస్ కామెడీ, హారర్ జానర్లలో కొత్తగా కనిపించనున్నారు. అఖండ 2 థియేటర్లలో టీజర్, రెండో సింగిల్ ప్రోమోతో ప్రమోషన్లను ఉధృతం చేసింది చిత్రబృందం. సంజయ్ దత్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ వంటి తారలతో అంచనాలు పెరుగుతున్నాయి.

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. సాధారణంగా లార్జర్ దేన్ లైఫ్ రోల్స్‌లో కనిపించే ప్రభాస్, ఈ చిత్రంలో కామెడీతో పాటు తొలిసారి హారర్ జానర్‌లో నటించి కొత్తదనాన్ని చూపనున్నారు. సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చిత్ర యూనిట్ ప్రమోషన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ఫస్ట్ సింగిల్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. అఖండ 2 థియేటర్లలో ది రాజాసాబ్ స్పెషల్ టీజర్ ప్లే చేస్తున్నారు. తాజాగా విడుదలైన సెకండ్ సింగిల్ ప్రోమో సినిమాలోని రొమాంటిక్ కోణాన్ని ఆవిష్కరించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కథ వెనుక అసలు రహస్యం ఇదే

TOP 9 ET News: అబ్బాయి రికార్డ్‌ బద్దలు కొట్టిన బాబాయ్‌

రెస్టారెంట్ బిజినెస్‌లో దూసుకుపోతున్న టాలీవుడ్ హీరో

రెండో పెళ్లీ పెటాకులేనా ?? పాపం.. ఆ డైరెక్టర్

Akhanda 2: థియేటర్స్‌లో దుమ్మురేపుతున్న అఖండ 2.. 3rd Day ఎంత వసూల్ చేసిందంటే