అలెర్ట్.. అలెర్ట్..! వారందరికీ దిల్ రాజు హెచ్చరిక

Updated on: Jul 07, 2025 | 7:45 PM

తమ్ముడు మూవీ రిలీజ్ అయిన వేళ... తమ్ముడు మూవీ టీం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. రిలీజ్‌కు ఒక రోజు ముందే నుంచే తమ సినిమాను ఎవరూ టార్గెట్ చేసినా ఊపేక్షించేది లేదంటూ... సోషల్ మీడియా వేదికగా హెచ్చిరికలు జారీ చేసింది. తమ్ముడు సినిమాను టార్గెట్ చేస్తూ.. ట్రోల్స్ చేస్తూ, సినిమాపై నెగిటివ్ రివ్యూలు ఇచ్చే వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది తమ్ముడు చిత్ర బృందం.

ఈ మేరకు ‘తమ్ముడు’ సినిమాను దెబ్బతీసే ఉద్దేశ్యంతో అగౌరవపరిచే రివ్యూస్ ఇస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకోవలసి ఉంటుందని నిర్మాతలు ముందుగానే హెచ్చరించారు. బాధ్యతాయుతమైన విమర్శలకు తాము సిద్ధంగానే ఉన్నామని, కానీ సినిమాను కావాలని దెబ్బతీసే లక్ష్యంగా నెగిటివ్ రివ్యూలు ఇస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని తమ్ముడు చిత్ర బృందం హెచ్చరించింది. ఇక నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా తమ్ముడు. 18ఏళ్ల తర్వాత లయ ఈ మూవీతో కంబ్యాక్ ఇచ్చింది.కాంతార తర్వాత సప్తమీ గౌడ్ ఈ సినిమాతో తెలుగులో డెబ్యూ చేసింది. హై ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో… సుమారు 75 కోట్ల రూపాయల బడ్జెట్‌తో దిల్ రాజు ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అల్లు అర్జున్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేశారు.. రవితేజ వాళ్లకు దిమ్మతిరిగేలా చేశాడు