Thalapathy Vijay: దళపతి కోటి రూపాయల విరాళం.. విశాల్ ఎమోషనల్

Updated on: Mar 14, 2024 | 12:11 PM

విజయ్ సేవా గుణం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే తన సొంత డబ్బుతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాడు. కొన్ని నెలల క్రితం మిచాంగ్ తుపాన్ బాధితులకు కూడా వరద సహాయం అందించి తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు. తాజాగా మరోసారి తన ఉదారతను చాటుకున్నాడీ కోలీవుడ్ స్టార్ హీరో. దక్షిణ భారత సినీ నటీనటుల సంఘమైన నడిగర్‌ సంఘం నూతన భవన నిర్మాణం కోసం ఏకంగా కోటి రూపాయాల విరాళం అందించారు విజయ్.

విజయ్ సేవా గుణం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే తన సొంత డబ్బుతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాడు. కొన్ని నెలల క్రితం మిచాంగ్ తుపాన్ బాధితులకు కూడా వరద సహాయం అందించి తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు. తాజాగా మరోసారి తన ఉదారతను చాటుకున్నాడీ కోలీవుడ్ స్టార్ హీరో. దక్షిణ భారత సినీ నటీనటుల సంఘమైన నడిగర్‌ సంఘం నూతన భవన నిర్మాణం కోసం ఏకంగా కోటి రూపాయాల విరాళం అందించారు విజయ్. ఈ విషయాన్ని మరో స్టార్ హీరో విశాల్ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ సందర్భంగా విజయ్ తో కలిసున్న ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేసిన విశాల్‌. ఇంతకీ విశాల్ ఏం ట్వీట్ చేశారంటే.. “థ్యాంక్యూ అన్నది కేవలం రెండు పదాలే కావొచ్చు. కానీ నా మనసు లోపలి నుంచి వచ్చే ఆ మాటకు ఎంతో విశాలమైన భావన ఉంది. నా అభిమాన నటుడు, నాకు అత్యంత ఆప్తుడైన దళపతి విజయ్ కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. నడిగర్ సంఘం భవవ నిర్మాణం కోసం ఈ మొత్తాన్ని అందించినట్లు చెప్పారు. ఆయనకు ఆ భగవంతుడి దీవెనలు, ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి. మీ సహకారం, ప్రమేయం లేకుండా నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తి కాదు. అందరి మద్దతుతో త్వరలోనే మన కల సాకారం కానుంది. దళపతి విజయ్ నిర్ణయం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది” అని దళపతి విరాళంపై ఎమోషనల్‌గా రాసుకొచ్చారు విజయ్‌.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Premalu: ‘ప్రేమలు’ చూసి మహేష్ ఫిదా.. నవ్వలేక చచ్చాడట!

Devi Sri Prasad: కల నెరవేరిన వేళ.. ఖుషీ ఖుషీగా దేవీశ్రీ

Devi Sri Prasad: ఏమైంది ?? దేవీ ఇలా మారిపోయాడు ??

Loading...
Unable to load recommendations.
Follow Us