ఖతర్నాక్ ట్రైలర్స్‌తో పిచ్చెక్కిస్తున్న చిన్న సినిమాలు

Edited By:

Updated on: Dec 22, 2025 | 5:26 PM

సినిమా విడుదలకు ముందు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెటించడంలో ట్రైలర్‌ల పాత్ర కీలకం. 2025లో ఛాంపియన్, శంభాలా వంటి తెలుగు సినిమాల ట్రైలర్స్ అంచనాలను అమాంతం పెంచాయి. తేజ సజ్జా మిరాయ్, శేఖర్ కమ్ముల కుబేరా, దండోరా లాంటి చిత్రాల విజయానికి కూడా ట్రైలర్లే ప్రధాన కారణం. సినిమా హిట్‌కు సగం కారణం ట్రైలరే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

రిలీజయ్యే వరకు సినిమా ఫ్యూచర్ ఎవరికీ తెలియదు.. కానీ దానిపై ఆసక్తి పెంచేది మాత్రం కచ్చితంగా ట్రైలరే..! అది బాగుంటే సగం సినిమా హిట్టైపోయినట్లే. అలాంటి ట్రైలర్స్ కట్ చేయడంలో Phd చేసారు మనోళ్లు. మరీ ముఖ్యంగా 2025లో ట్రైలర్స్‌తోనే మాయ చేస్తున్నాయి కొన్ని మూవీస్. అలాంటివే మరో రెండు సినిమాలు వస్తున్నాయిప్పుడు. మరి అవేంటో చూద్దామా..? పెళ్లి సందడి తర్వాత మూడేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని రోషన్ చేస్తున్న సినిమా ఛాంపియన్. రజాకార్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ట్రైలర్‌తో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వై జయంతి మూవీస్ కావడంతో టెక్నికల్‌గానూ సౌండింగ్‌తో వస్తుంది ఛాంపియన్. మది సినిమాటోగ్రఫీ, మిక్కీ మ్యూజిక్, కోటగిరి ఎడిటింగ్, పీటర్ హెయిన్ యాక్షన్.. ఇవన్నీ ట్రైలర్‌లోనే కొట్టొచ్చినట్లు కనిపించాయి. ట్రైలర్‌తోనే ఆసక్తి పెంచేసిన మరో సినిమా శంభాలా. ఆది సాయికుమార్ హిట్లలో లేకపోయినా.. ఈ సినిమా కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉంది.. ట్రైలర్‌తోనే బిజినెస్ పూర్తి చేసుకుంది శంభాలా. మరోవైపు శివాజీ, నవదీప్ నటించిన దండోరా సైతం ట్రైలర్‌తోనే ఆసక్తి అలా పెంచేసింది. కులం కాన్సెప్ట్‌తో వస్తుంది ఈ చిత్రం. ట్రైలర్‌తోనే ఇది హార్డ్ హిట్టింగ్ సినిమా అని అర్థమైపోతుంది. 2025లో కొన్ని సినిమాల ట్రైలర్ కట్స్ పీక్స్‌లో ఉన్నాయి. తేజ సజ్జా మిరాయ్, శేఖర్ కమ్ముల కుబేరా సినిమాల విజయంలో వాటి ట్రైలర్స్ కీ రోల్ పోషించాయి. అలాగే కోర్ట్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి చిన్న సినిమాలకు సైతం ఓపెనింగ్స్ రావడానికి ట్రైలర్స్ బాగా హెల్ప్ అయ్యాయి. బాహుబలి ది ఎపిక్ పాత సినిమానే అయినా.. ఎప్పుడెప్పుడు చూడాలా అనే ఆసక్తి కలిగించేలా ట్రైలర్ కట్ చేసారు రాజమౌళి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

T20 వరల్డ్‌కప్‌కు టీమిండియా ఆటగాళ్లు వీరే

అర్ధరాత్రి కారు బీభత్సం.. ఆ తర్వాత

అద్భుతం.. పద్మావతి అమ్మవారికి పసుపు కొమ్ముల అలంకరణ

చంపేస్తోన్న చలి.. అత్యల్ప ఉష్ణోగ్రతలో సరికొత్త రికార్డ్‌

కొడుకు సమాధి వద్ద సీసీ కెమెరా ఏర్పాటు.. ఎందుకో తెలిస్తే..