బాక్సాఫీస్‌ దగ్గర కాసులు కురిపిస్తున్న దేశభక్తి చిత్రాలు

Updated on: Jan 27, 2026 | 7:20 PM

రిపబ్లిక్ వేడుకల సందర్భంగా దేశభక్తి చిత్రాలపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. సరిహద్దుల్లో సైనికులు పడే కష్టాలు, వారి సాహసాలను వెండితెరపై ప్రదర్శించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, సరిలేరు నీకెవ్వరు, సీతారామం వంటి సినిమాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. సైనికుల జీవితాలు, వారి కుటుంబాల కథలను తెలిపే చిత్రాలు ఎల్లప్పుడూ ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాయి.

రిపబ్లిక్ వేడుకలతో దేశమంతా దేశభక్తి ఉప్పొంగుతున్న ఈ తరుణంలో, వెండితెరపై సైనికులను ప్రధానంగా చూపించిన చిత్రాలను జనాలు గుర్తు చేసుకుంటున్నారు. మన సైనికులు సరిహద్దుల్లో పడే కష్టాలను, వారి త్యాగాలను స్మరించుకుంటూ, మన కవుల కలాల నుంచి జాలువారిన దేశభక్తి పాటలనూ ఈ సందర్భంగా ఆలపిస్తున్నారు. సరిహద్దున నువ్వు లేకుంటే కంటిపాప కంటి నిండా నిదురపోదురా వంటి పాటలతో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం సైనికుల శిక్షణ, సాహసాలు, వారి భావోద్వేగాలను కళ్లకు కట్టినట్లు చూపించింది. మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాలు స్టార్ హీరోలను సైతం ఆలివ్ గ్రీన్ దుస్తుల్లో చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఐకాన్‌స్టార్‌తో సందీప్‌ మూవీ… మొదలయ్యేది అప్పుడే

Chiranjeevi: పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ లేదు

సక్సెస్‌ కోసం సవాలక్ష తిప్పలు.. ఇండస్ట్రీలో ఇప్పుడిదే చర్చ

సూపర్‌ సక్సెస్‌లో బాలీవుడ్‌.. టాలీవుడ్‌ మేల్కోవాల్సిన టైమ్‌ వచ్చేసింది

Pawan Kalyan: ఒకటీ రెండు కాదు.. పవర్‌స్టార్‌ మూడు ప్రాజెక్టులు లైన్లో పెడుతున్నారా