కాసులు కురిపిస్తున్న కామెడీ జానర్
తెలుగు చిత్ర పరిశ్రమలో కామెడీ జానర్‌కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. మినిమం గ్యారెంటీ విజయాన్ని అందిస్తుంది. విశ్వక్ సేన్ ఫంకీ, ప్రియదర్శి మిత్రమండలి, కిరణ్ అబ్బవరం కె-ర్యాంప్తో పాటు తెలుసు కదా వంటి అనేక హాస్య చిత్రాలు వరుసగా విడుదలై ప్రేక్షకులకు గొప్ప వినోదాన్ని పంచుతున్నాయి.
తెలుగు వెండితెరపై కొన్ని జానర్‌లకు ఎప్పుడూ ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. వీటిలో హాస్య చిత్రాలు ప్రముఖమైనవి. ఎలాంటి ఫార్ములాలు వర్కవుట్ కాకపోయినా, కామెడీ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద కనీస గ్యారెంటీ విజయాన్ని సాధిస్తాయనే నమ్మకం ఉంది. అందుకే రాబోయే చిత్రాల జాబితాలో ఈ జానర్ సినిమాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వరుస పరాజయాల తర్వాత యువ కథానాయకుడు విశ్వక్ సేన్ కూడా కామెడీ చిత్రాన్నే ఎంచుకున్నారు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవి దర్శకత్వంలో ఫంకీ అనే చిత్రంతో ఆయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే విడుదలై ఆసక్తిని రేకెత్తించింది. రాబోయే సినిమాల్లోనూ కామెడీ జోష్ అధికంగా ఉంది. ప్రియదర్శి హీరోగా తెరకెక్కిన మిత్రమండలి చిత్రం ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూటు మార్చిన రౌడీ హీరో.. ఇక విజయ్ గురి దానిపైనే..
లెక్క తప్పుతున్న టాప్ బ్యానర్స్ అంచనాలు.. దీనికి కారణాలు అవేనా
స్టార్ హీరోలకు తప్పని లీకుల కష్టాలు.. ఈ సమస్యకు చర్యలు తప్పనిసరి అంటున్న మేకర్స్
మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిన రుక్మిణీ వసంత్
ప్లాన్ ఇంటర్నేషనల్ అంటున్న రాజమౌళి.. ఇక బాక్సులు బద్దలవ్వాల్సిందే
