యాక్షన్‌లోకి దిగిన స్టార్ హీరోయిన్లు.. ఇక రచ్చ రచ్చే

Updated on: Jan 11, 2026 | 5:17 PM

స్టార్ హీరోయిన్లు యాక్షన్ మోడ్‌లోకి ప్రవేశించారు. 2026లో పలువురు అగ్ర తారలు కత్తి పట్టుకుని బరిలోకి దిగుతున్నారు. సమంత, నయనతార, రష్మిక మందన్న, త్రిష, సాయి పల్లవి, తమన్నా వంటి నటీమణులు యాక్షన్ ప్రధాన చిత్రాలతో ప్రేక్షకులను అలరించనున్నారు. మగ హీరోలకే యాక్షన్ పరిమితం కాదంటూ తమ సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు.

మాస్ సినిమాలు, యాక్షన్ ఎపిసోడ్స్ హీరోలకే పరిమితం కాదంటూ స్టార్ హీరోయిన్లు సవాల్ విసురుతున్నారు. తాజాగా సీనియర్ హీరోయిన్లంతా యాక్షన్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. 2026లో పలువురు అగ్ర తారలు కత్తులు, కటార్లతో యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఒక్కొక్కరి నుంచి కనీసం రెండు, మూడు యాక్షన్ చిత్రాలు రానున్నాయి. సమంత మా ఇంటి బంగారం చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యాక్షన్ ప్రియులను ఆకట్టుకోనున్నారు. గతంలో యశోదలో ఆమె అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు చేశారు. లేడీ సూపర్ స్టార్ నయనతార 2026లో విడుదల కానున్న రెక్కైలో రచ్చ చేయనున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టికెట్ రేటు పెరుగుదల పై హైకోర్టు అక్షింతలు.. సొల్యూషన్ ఏంటి

ఆస్కార్ రేసులో ఇండియన్ సినిమాల దూకుడు

చిరంజీవికి ఏపీ సర్కార్‌ లడ్డూలాంటి న్యూస్

Chiranjeevi: మాట నిలబెట్టుకున్న మెగాస్టార్ చిన్నారికి మెగా సాయం

The Raja Saab Collection: టాక్ సంగతి పక్కకు పెడితే… రాజాసాబ్‌కు డే1 దిమ్మతిరిగే కలెక్షన్స్‌