Tamannaah: రౌడీ జనార్ధనతో మిల్కీబ్యూటీ స్టెప్పులేస్తున్నారా ??

Updated on: Jan 27, 2026 | 7:27 PM

ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్‌కు తమన్నా బెస్ట్ ఛాయిస్‌గా ఉండేవారు. కానీ, ఇప్పుడు మేకర్స్ ఆలోచన మారుతోంది. నార్త్‌తో పాటు సౌత్‌లోనూ ఆమె స్థానంలో కొత్త హీరోయిన్స్‌ను తీసుకుంటున్నారు. జైలర్ 2లో నోరా ఫతేహిని ఎంచుకోవడం దీనికి నిదర్శనం. దీంతో తమన్నా తన కెరీర్‌లో కొత్త కోణాన్ని వెతుక్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్స్‌లో తన స్థానాన్ని కోల్పోతున్నారా అనే చర్చ ఇప్పుడు టాలీవుడ్‌లో జోరందుకుంది. ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్ అంటే తమన్నా పేరు వినిపించేది. నార్త్ ఇండియన్ ప్రేక్షకులు కూడా ఆమె స్టెప్పుల కోసం ఎదురుచూసేవారు. అయితే, ఇప్పుడు మేకర్స్‌లో ఆమెతో పదే పదే స్పెషల్ సాంగ్స్ చేయించడంపై విముఖత కనిపిస్తోంది. దురందర్ చిత్రంలో కొరియోగ్రాఫర్ తమన్నాతో స్పెషల్ సాంగ్ చేయాలని సూచించినా, దర్శకుడు ఆదిత్య థర్ నిరాకరించారట. కొత్తదనం కోసం ఇద్దరు వేర్వేరు లేడీస్‌ను ఎంచుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. సౌత్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న దేశభక్తి చిత్రాల వసూళ్లు

బాక్సాఫీస్‌ దగ్గర కాసులు కురిపిస్తున్న దేశభక్తి చిత్రాలు

ఐకాన్‌స్టార్‌తో సందీప్‌ మూవీ… మొదలయ్యేది అప్పుడే

Chiranjeevi: పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ లేదు

సక్సెస్‌ కోసం సవాలక్ష తిప్పలు.. ఇండస్ట్రీలో ఇప్పుడిదే చర్చ