సుశాంత్ సూసైడ్ కేసులో.. ప్రియురాలు రియాకు బిగ్ రిలీఫ్
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ కేసులో రియా చక్రవర్తికి ముంబై NDPS కోర్టులో భారీ ఊరట లభించింది. ఆమె, ఆమె కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలను డీఫ్రీజ్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో నిర్దోషిగా బయటపడిన రియా ప్రస్తుతం తన కెరీర్‌ను తిరిగి ప్రారంభించారు. రోడీస్, పాడ్‌కాస్ట్, నెట్‌ఫ్లిక్స్ సినిమాలతో బిజీగా ఉన్నారు.
జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన ఫ్లాట్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. దీంతో తన కొడుకు మరణానికి రియా చక్రవర్తే కారణం అంటూ సుశాంత్ తండ్రి కె.కె సింగ్.. అప్పట్లో పాట్నాలో కేసు నమోదు చేశాడు. అప్పటి నుంచి కోర్టులో నడుస్తున్న ఈ కేసులో.. ఎట్టకేలకు కీలక పరిణాం చోటుచేసుకుంది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో ప్రియురాలు రియా చక్రవర్తికి బిగ్ రిలీఫ్ దక్కింది. ఈ కేసులో ఆమె ఇప్పటికే నిర్దోషిగా బయటకొచ్చారు. ఈ నేపథ్యంలోనే బ్యాంక్ ఖాతాలను పునరుద్ధరించాలని ముంబైలోని ప్రత్యేక NDPs కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, తల్లి సంధ్యలకు చెందిన బ్యాంకు ఖాతాలను డీఫ్రీజ్ చేయాలని ఆదేశించింది. ఇక ప్రస్తుతం రియా తిరిగి తన కెరీర్ ను ముందుకు సాగుతున్నారు. ఆమె ఇటీవలే రోడీస్‌లోనూ కనిపించారు. అంతేకాదు తన సొంత పాడ్‌కాస్ట్‌ను కూడా ప్రారంభించి పలు సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తున్నారు. వీటితో పాటే నెట్‌ఫ్‌లిక్స్ నిర్మిస్తున్న ఫ్యామిలీ బిజినెస్ సినిమాలోనూ నటిస్తున్నారు రియా.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
JD Chakravarthy: విష్ణు ప్రియతో రెండో పెళ్లి.. ఎట్టకేలకు నోరు విప్పిన జేడీ చక్రవర్తి
