Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్‌ స్టార్‌ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..

| Edited By: Janardhan Veluru

Apr 25, 2022 | 6:23 PM

సూపర్ స్టార్ కృష్ణ.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్‌ హవా కొనసాగుతున్న సమయంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కృష్ణ తనదైనశైలిలో దూసుకుపోతూ సూపర్‌స్టార్‌గా నిలిచారు. ఆ రోజుల్లో కృష్ణకు ఉన్నన్ని అభిమాన సంఘాలు...


సూపర్ స్టార్ కృష్ణ.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్‌ హవా కొనసాగుతున్న సమయంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కృష్ణ తనదైనశైలిలో దూసుకుపోతూ సూపర్‌స్టార్‌గా నిలిచారు. ఆ రోజుల్లో కృష్ణకు ఉన్నన్ని అభిమాన సంఘాలు మరెవరికీ ఉండేవి కాదంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు వయోభారంలో ఉన్న ఆయన ఇంటివద్దే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఏదైనా కుటుంబపరమైన ఫంక్షన్లలో కనిపించడం తప్ప ఎక్కువగా ఎక్కడా కనిపించడం లేదు. తాజాగా ఆయనకు సంబంధించిన ఒక ఫొటో నెట్టింట వైరల్ అవుతూ, అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవలే తమ కుటుంబానికి సంబంధించిన ఒక ఫంక్షన్లో ఆయన పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలను కృష్ణ కూతురు మంజుల సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ ఫొటోలో కృష్ణ మొహంలో ఏదో తేడాగా కనిపిస్తుండటంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ముఖం మీద ఏవో మచ్చలు వచ్చినట్టు కనిపించడంతో… కృష్ణకు ఏమైందని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణ సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. ఆయన ఇన్విజిబుల్ గా ఉండే ఫేస్ మాస్క్ ధరించారని… అది ముఖంలో కలిసిపోవడం వల్ల అలా కనిపించిందని క్లారిటీ ఇచ్చారు. కృష్ణ ఆరోగ్యంగా ఉన్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. దీంతో, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..

Viral Video: రోడ్డు దాటుతున్న బైక్ ను ఢీ కొట్టి.. ఆగకుండా ఈడ్చుకెళ్లి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

Monkey Funny video: మొద‌టిసారి డ్రాగ‌న్ ఫ్రూట్ తిన్న పిల్లకోతి రియాక్షన్‌.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో

Viral Video: సంగీత్‌ ఫంక్షన్‌లో డాన్స్‌ అదరగొట్టిన నవ వధువు..! అదిరిపోయే స్టెప్పులకు కామెంట్లతో ఆశీర్వచనాలు

Follow us on