Suhas: కలర్ కరెక్షన్.. అతడికి పెరుగుతున్న టెన్షన్..!

Edited By:

Updated on: Sep 20, 2026 | 6:36 PM

‘మండాడి’ సక్సెస్‌ మీట్‌లో దర్శకుడు మతిమారన్‌ చేసిన సుహాస్‌ రంగుపై వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో చర్చకు దారితీశాయి. సుహాస్‌ సొంత ప్రాంతంలో రంగు ఆధారంగా వ్యాఖ్యలు ఎదుర్కొన్నారని దర్శకుడు చెప్పడం వివాదంగా మారింది. ఆ సమయంలో సుహాస్‌ స్పందించకపోవడంపైనా కొందరు విమర్శలు చేశారు. అయితే తర్వాత మతిమారన్‌ తన వ్యాఖ్యలు మొత్తం తెలుగు ప్రజలు, తెలుగు సినిమా లేదా ప్రేక్షకులను ఉద్దేశించినవి కావని స్పష్టం చేశారు. సుహాస్‌ కూడా తెలుగు ప్రేక్షకుల మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు.

సుహాస్ లేనిపోని చిక్కుల్లో పడ్డారా..? అరవ దర్శకుడు చేసిన అనవసరపు కమెంట్స్‌తో అనుకోని వివాదంలో ఇరుక్కుంటున్నారా..? నల్ల రంగు అంటూ చేసిన రేసిస్ట్ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయా? అసలు టాలీవుడ్‌లో కలర్ డిస్క్రిమినేషన్ ఉందా..? అలా మాట్లాడినపుడు సుహాస్ నవ్వుతూ ఎందుకు ఊరుకున్నారు..? ఈ కాంట్రవర్సీ నుంచి సుహాస్ ఎలా బయటపడతారు..? మండాడితో తమిళంలోకి వెళ్లకముందే తెలుగులో సుహాస్ మంచి ఆర్టిస్ట్.. విజయ్ సేతుపతి రేంజ్ ఆర్టిస్ట్ అంటూ చాలా మంది పొగిడారు కూడా. కానీ ఈయన చేసిన పనికిప్పుడు చివాట్లు పడుతున్నాయి.. ఒక్కోసారి మౌనంగా ఉన్నా తప్పు చేసినట్లే. సుహాస్ ఇదే చేసారిప్పుడు. మండాడి సక్సెస్ మీట్‌లో సుహాస్ నల్లగా ఉన్నందుకే తెలుగులో సక్సెస్ కాలేదని దర్శకుడు మదిమారన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సొంత ఇండస్ట్రీలో రంగు రూపం వల్ల ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని ఓ కాంట్రవర్షియల్ స్టేట్‌మెంట్ పాస్ చేశారు మండాడి డైరెక్టర్. ఆ టైమ్‌లో పక్కనే ఉన్న సుహాస్ ఖండించకపోగా నవ్వుతూ ఉన్నారు. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కమెడియన్ నుంచి హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సుహాస్‌.. స్క్రిప్ట్స్ వినడానికి కూడా టైమ్ లేనంతగా బిజీ అయ్యారు. నిజానికి మనవాళ్లు కలరే చూస్తే రజినీకాంత్ నుంచి ఎంతోమంది హీరోల సినిమాలు తెలుగులో చూడరు కదా..? ఇలాంటి దారుణమైన కామెంట్స్ పాస్ చేసినపుడు.. అలా కాదని ఖండించకుండా కామ్‌గా ఉండటం సుహాస్ చేసిన తప్పే అనేది అందరి వాదన. ఈ ఇష్యూ మరింత పెద్దది కాకుముందే సుహాస్ స్పందిస్తే బెటర్.. లేదంటే విషక్ష్ం చాలా దూరం వెళ్తుందేమో..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారీగా పెరగనున్న బియ్యం, చక్కెర ధరలు

కవల పిల్లల తల్లి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనుమానాస్పద మృతి!

ఇండిగో బాదుడు.. దేశీయ విమాన ప్రయాణం మరింత భారం

చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..

PM Modi: 76 ఏళ్ల వయసులో ఇంత యాక్టివ్ గా ఎలా? మోదీ హెల్త్ సీక్రెట్ ఇదే

Loading...
Unable to load recommendations.
Follow Us