నటి శ్రీదేవి ఆస్తుల వివాదం.. కోర్టుకెక్కిన బోనీ కపూర్

Updated on: Mar 19, 2026 | 1:20 PM

సినిమా తారలు బతికున్నప్పుడు వాళ్ల సినిమాలు, గ్లామర్ ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటాయి. వాళ్ల తదనంతరం ప్రాపర్టీ వ్యవహారాలు కూడా అంతే స్థాయిలో చర్చనీయాంశంగా మారుతుంటాయి. అతిలోకసుందరి, దివంగత నటి శ్రీదేవి చెన్నై ప్రాపర్టీ విషయంలోనూ ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. తమ లీగల్ ఆస్తిని కాపాడుకునేందుకు ఆమె భర్త బోనీ కపూర్.. త కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌ కలిసి ఏకంగా మద్రాస్ హైకోర్టు గడప తొక్కారు. దాదాపు ఏడాదిగా నలుగుతున్న ఈ ప్రాపర్టీ భూవివాదం రోజురోజుకూ ముదురుతూ, ఇప్పుడు లీగల్‌గా సరికొత్త మలుపు తీసుకుంది.

చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్ అనేది చాలా ఖరీదైన ఏరియా. ఇక్కడే శ్రీదేవికి 4.7 ఎకరాల అత్యంత విలువైన భూమి ఉంది. దశాబ్దాల క్రితం ఆమె ఎంతో ఇష్టపడి కొనుగోలు చేసిన ఈ ప్రాపర్టీపై గతేడాది సడెన్‌గా ముగ్గురు వ్యక్తులు హక్కులు కోరడంతో ఈ న్యాయపోరాటం మొదలైంది. ఏళ్ల తరబడి తమ ఫ్యామిలీ అధీనంలో ఎలాంటి వివాదాల్లేకుండా ఉన్న స్థలాన్ని ఎవరో కావాలనే లాక్కోవాలని చూస్తున్నారని, అన్యాయంగా తప్పుడు కేసులతో ఇబ్బంది పెడుతున్నారని బోనీ కపూర్ కోర్టుకెక్కాki. ఇన్నేళ్ల తర్వాత ఈ భూవివాదం తెరపైకి రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఉన్న 4.77 ఎకరాల భూమిని శ్రీదేవి 1988లో సంబంధ ముదలియార్ కుటుంబం నుంచి కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఆ ఆస్తి శ్రీదేవి కుటుంబం ఆధీనంలోనే ఉంది. అయితే, చంద్రశేఖరన్ ముదలియార్ రెండో భార్య పిల్లలమని చెప్పుకుంటున్న నటరాజన్, శివగామి మరికొందరు, తాము చట్టబద్ధమైన వారసులమని పేర్కొంటూ ఆ ఆస్తిలో వాటా కోసం చెంగల్పట్టు అదనపు జిల్లా కోర్టులో దావా వేశారు.

మరిన్ని వీడియోల కోసం :

ఫ్లయిట్‌లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్

ఆర్టీసీ బస్సు నడిపిన ఎమ్మెల్యే.. వైరల్ అవుతున్న వీడియో

బిగ్ అలర్ట్ : కొనసాగుతున్న ద్రోణి..తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు

 

Follow Us