చిన్న సినిమాలకు పాటే ప్రాణం..మ్యూజిక్‌పై దర్శకుల స్పెషల్ ఫోకస్
మాటలు చెప్పలేని మాయను పాటలు చేసి చూపుతాయని దర్శకులు నమ్ముతున్నారు. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలకు సంగీతమే ప్రాణంగా నిలుస్తోంది. అర్థం కాని ఫాస్ట్ బీట్స్ కాకుండా అందమైన తెలుగు పాటలకు పెద్ద పీట వేస్తున్నారు. శ్రీనివాస మంగాపురం, బేబీ, సింగీతం వంటి చిత్రాల పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయానికి బాటలు వేస్తున్నాయి.
కొన్నిసార్లు మాట చేయలేని మాయను పాట చేసి చూపిస్తుందని అంటుంటారు. ఈ నమ్మకంతోనే మన దర్శకులు తమ సినిమాల్లో మ్యూజిక్‌కు పెద్ద పీట వేస్తున్నారు. ముఖ్యంగా చిన్న సినిమాలకు పాటలే ప్రాణంగా మారుతున్నాయి. అర్థం కాని ఫాస్ట్ బీట్స్ కాకుండా, అందమైన తెలుగు పాటల వైపు అడుగులు వేస్తున్నారు. ఈ మధ్య కాలంలో విడుదలైన చిన్న సినిమాల్లోని పాటలు మ్యాజిక్ చేసి, వాటి విజయానికి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. తాజాగా శ్రీనివాస మంగాపురం సినిమా నుంచి విడుదలైన మూడు పాటలకు ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. జైకృష్ణ, రషా తడాని పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని అజయ్ భూపతి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలోని గుండె పేలిపోతుందే పాట కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. బేబీ చిత్రం నుంచి విడుదలైన సంచారమే, ప్రియసఖి వంటి పాటలు బాగా ట్రెండ్ అయ్యాయి. గోర్రెటి వెంకన్న రాసిన సంచారమే పాట మ్యూజిక్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. గత వారం విడుదలైన సింగీతం సినిమాలో నిండా పాటలే ఉండి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కిరణ్ అబ్బవరం హీరోగా రవి నంబూరి తెరకెక్కిస్తున్న చెన్నై లవ్ స్టోరీ చిత్రంలో పాటలే ప్రధాన ఆకర్షణ. ఈ సినిమా రైటర్ కం ప్రొడ్యూసర్ సాయి రాజేష్ తాను చెప్పాలనుకున్న కథను ఎక్కువగా పాటల రూపంలోనే చెబుతున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఏడుకు ఏడు మెలోడీ పాటలు ఉండబోతున్నాయి. అలాగే నాగబంధం సినిమాలోని పాటలు కూడా బాగా పాపులర్ అయ్యాయి. చిన్న చిత్రాలకు సంగీతం ఎంత కీలకమో ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఎనిమిది మంది దుర్మరణం
మాయమైపోతున్న మాన్‌సూన్.. రైతుల్లో టెన్షన్ టెన్షన్
బద్రీనాథ్ క్షేత్రానికి ముఖేశ్ అంబానీ కళ్లు చెదిరే విరాళం
జాహ్నవి తిరిగొస్తుందా? జ్ఞాని తిమ్మప్ప సంచలన వ్యాఖ్యలు
