శ్రుతి హాసన్ కెరీర్ స్లో అవుతోందా..?వీడియో

Updated on: Dec 25, 2025 | 5:20 PM

శ్రుతి హాసన్ కెరీర్ స్లో అవుతోందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. మల్టీ టాలెంటెడ్ శ్రుతి గత రెండేళ్లుగా చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారు. 2023లో మూడు రిలీజ్‌లు ఉన్నా, గత ఏడాది ఆమెకు సినిమా విడుదలలు లేవు. ఈ ఏడాది కూలీలో నటించినా, తదుపరి పెద్ద ప్రాజెక్టులు సెట్స్‌పై లేవు. ఈ గ్యాప్ కావాలన్నా, అనుకోకుండా వచ్చిందానిపై స్పష్టత లేదు.

మల్టీ టాలెంటెడ్ పీపుల్‌కు సాధారణంగా వచ్చే సమస్య ఇది. వారు అన్ని విషయాలపై దృష్టి సారించాలని అనుకుంటారు. ఏ రంగంలో కాస్త గ్యాప్ వచ్చినా, అభిమానులు వారిని మిస్ అవుతున్నట్లు భావిస్తారు. మ్యూజిక్, యాక్టింగ్ రెండింటిపై శ్రద్ధ పెడుతున్న శ్రుతి హాసన్ విషయంలో కూడా ఇదే జరుగుతోందా అనే చర్చ నడుస్తోంది. ఒకప్పుడు హీరోయిన్లలో ఎంతో చలాకీగా, వైబ్రెంట్‌గా కనిపించే శ్రుతి హాసన్, మల్టీ టాలెంటెడ్ లేడీగా పేరు పొందారు. అయితే ఒకప్పటితో పోలిస్తే ఆమె కెరీర్ వేగం తగ్గిందని పరిశీలకులు అంటున్నారు. ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు విడుదల చేసిన క్రెడిట్ ఉన్న ఆమెకు, గత రెండేళ్లుగా కెరీర్ చాలా స్లోగా నడుస్తోంది. 2023లో శ్రుతి హాసన్‌కు మూడు రిలీజ్‌లు ఉన్నా, గత సంవత్సరం ఆమెకు ఒక్క సినిమా విడుదల కూడా లేదు.

మరిన్ని వీడియోల కోసం :

స్టార్ హీరోలు కూడా భయపడుతుంటే.. కాజల్‌ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది వీడియో

చడీచప్పుడు కాకుండా కూతురి పెళ్లి చేసిన జగపతి బాబు వీడియో

భారీగా ఆశ చూపినా.. బిగ్ బాస్‌కు నో చెప్పిన రిషి సార్ వీడియో