మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయిన కళ్యాణ్ పడాల కళ్లను తెరిపించాడు నటుడు శివాజీ. బిగ్ బాస్ 9 బజ్ హోస్ట్ అయిన శివాజీ.. కళ్యాణ్ పడాలను ఇంటర్వ్యూ చేసే క్రమంలో నీ గేమ్ ఛేంజ్ అవ్వడానికి కారణం దివ్య అంటే ఒప్పుకుంటావా అంటూ ఓకామెంట్ విసిరాడు.
నీలో స్పిరిట్‌ను రగిలించింది దివ్యనే అంటూ.. కళ్యాణ్‌కు సూటిగా చెప్పాడు. దీంతో అప్పటి వరకు ‘ఓన్లీ తనూజ వల్లే నేను ఇక్కడి వరకు వచ్చానంటూ పాట పాడుతూ వచ్చాడు కళ్యాణ్. ఉన్నట్టుండి శివాజీ మాటలకు అవును అంటూ.. తలూపి దివ్యకు థాంక్స్ చెప్పాడు. అలా తనూజ మాత్రమే కాదు.. తనూజను మించి దివ్య తనకు ఈ జెర్నీలో ఎక్కువ హెల్ప్ అయిందనే విషయాన్ని కళ్యాణ్ పడాలకు తెలియజేశాడు శివాజీ.
