ఆమె నా కూతురు కాదు.. అందరికీ షాకిచ్చిన ఒకప్పటి హీరోయిన్

|

May 30, 2024 | 5:53 PM

దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సుకన్య. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో దాదాపు 80కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యింది. రీసెంట్‌గా సెకండ్ ఇన్నింగ్స్‌ స్టార్ట్ చేసి.. సినిమాల్లో తల్లిగా, వదినగా ... క్యారెక్టర్స్‌ చేస్తూ.. వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇక ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా సుకన్య కూతురి గురించి కొన్ని వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.

దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సుకన్య. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో దాదాపు 80కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యింది. రీసెంట్‌గా సెకండ్ ఇన్నింగ్స్‌ స్టార్ట్ చేసి.. సినిమాల్లో తల్లిగా, వదినగా … క్యారెక్టర్స్‌ చేస్తూ.. వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇక ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా సుకన్య కూతురి గురించి కొన్ని వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరలవుతున్న ఓ ఫోటోలో సుకన్యతో కనిపిస్తున్న ఓ అమ్మాయి ఆమె కూతురు అంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆ వార్తలపై రియాక్టయ్యారు సుకన్య. ఆ ఫోటోలో తనతో ఉన్నది తన కూతురు కాదంటూ చెప్పి.. అందర్నీ షాక్ అయ్యేలా చేశారు. ఇంతకీ సుకన్య ఏం అన్నారంటే.. “కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ ఫోటోను చేను చూశాను. అందులో నాతో ఉన్నది నా కూతురు కాదు. నా చెల్లెలి కూతురు. ఆ ఫోటోను నా ట్విట్టర్ పేజీలో షేర్ చేశాను. నేను, నా సోదరి, ఆమె కుమార్తె అని పేర్కొన్నాను. కానీ నా కూతురు అంటూ ప్రచారం చేస్తున్నారు. నేను శ్రీధర్ రాజగోపాల్ ను పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నాను. మేమిద్దరం కొన్ని నెలలు మాత్రమే కలిసి ఉన్నాం. కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నా.. డివోర్స్ కోసం చాలా సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు నాతో ఉన్నది నా కూతురు అంటూ ప్రచారం చేస్తున్నారు. నా గురించి ఏదోక వార్త ప్రచారం చేయడానికే ఇలా చేస్తున్నారని అనిపిస్తోంది. నా చెల్లెలు కూతురు ఈ వార్త చూసి పెద్దమ్మ వల్ల నాకు గుర్తింపు వచ్చిందని అంటుంది. నాకు సంతోషంగానే ఉన్నా.. నిజం చెప్పాలని చెబుతున్నా..” అంటూ చెప్పుకొచ్చారు సుకన్య,.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నాగ్ రిజెక్ట్ చేసిన సినిమాతో.. పవన్‌ బంపర్ హిట్ !! ఆ సినిమా ఏంటో తెలుసా ??

Namitha: భర్తతో స్టార్ హీరోయిన్ విడాకులు !! క్లారిటీ…

ఆస్తి కోసం అమ్మాయి వేషం- అబ్బాయితో పెళ్లి.. ఆ తర్వాత ??

ఫ్లైఓవర్‌ప నుంచి వాహనదారులపై ఊడిపడ్డ పైప్‌ లైన్

అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానాన్ని చూశారా

Follow us on