Spirit: స్పిరిట్‌లో అదిరిపోయే ట్విస్ట్.. అదే మేజర్ హైలైట్
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. యానిమల్ తరహా హై వైలెన్స్ కాకుండా, సైలెంట్‌గా సాగే ఇగో క్లాష్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్, విలన్‌గా వివేక్ ఒబెరాయ్ మధ్య సాగే ఘర్షణ కథకు హైలైట్ కానుంది. ప్రస్తుతం కీలక సన్నివేశాల చిత్రీకరణ కొనసాగుతోంది.
సందీప్ రెడ్డి వంగా మోస్ట్ వైలెంట్ మేకర్.. ప్రభాస్ సూపర్ యాక్షన్ హీరో.. ఇలాంటి ఇద్దరూ కలిసినపుడు వచ్చే ఔట్ పుట్ కూడా మోస్ట్ వైలెంట్‌గానే ఉంటుందని ఊహిస్తారంతా. కానీ ఇక్కడే సందీప్ రూట్ మార్చేస్తున్నారు.. ఓ కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. స్పిరిట్ కోసం ఈ దర్శకుడు ఫాలో అవుతున్న రూటే సపరేటు. మరి ప్రభాస్ కోసం వంగా ఏం చేస్తున్నారు..? రెబల్ మోడ్ ఎలా ఉండబోతుంది..? ఏం చేసినా కొత్తగా ఉండాలి.. ఇండియన్ సినిమాకి తన మేకింగ్ స్టైల్ ఏంటో చూపించాలని గట్టిగానే ఫిక్సయ్యారు సందీప్ రెడ్డి వంగా. కథలు రొటీన్‌గానే అనిపించినా.. ఈయన తీసే విధానం అలాగే ఉంటుంది. అర్జున్ రెడ్డిలో ప్రేమలోని కొత్త కోణం చూపించారు వంగా. ఎన్నో లవ్ స్టోరీస్ వచ్చినా.. అర్జున్ రెడ్డి పాత్ బ్రేకింగ్ మూవీ అవ్వడానికి సందీప్ రైటింగ్, వే ఆఫ్ మేకింగే ప్రధాన కారణం. యానిమల్ కూడా అంతే..! కథా పరంగా సింపుల్ తండ్రీ కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ డ్రామా. కానీ దాన్ని సందీప్ హ్యాండిల్ చేసిన విధానం.. మేకింగ్ స్టైల్ అన్నీ దీన్ని కొత్తగా మార్చేసాయి. రొటీన్ కథ చూస్తున్నామనే ఫీల్ కూడా రాకుండా.. స్క్రీన్ ప్లేతో పాటు మేకింగ్‌తో మాయ చేయడమే సందీప్ రెడ్డి వంగా స్టైల్. స్పిరిట్ విషయంలోనూ ఇదే చేస్తున్నారీయన. యానిమల్‌తో వైలెంట్ సినిమాకి అర్థం చూపించారు వంగా. స్పిరిట్ కూడా యాక్షన్ సినిమానే ముందు నుంచి ప్రచారం జరుగుతుంది. అందులో నిజం లేకపోలేదు.. కానీ యానిమల్ తరహా వైలెన్స్ స్పిరిట్‌లో ఉండదని.. ఇది చాలా సెటిల్డ్‌గా సాగే సైలెంట్ యాక్షన్ డ్రామా అని.. ముఖ్యంగా ఇగో క్లాషెస్ చుట్టూనే కథ సాగుతుందని తెలుస్తుంది. ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుంటే.. వివేక్ ఒబేరాయ్ విలన్‌గా కనిపిస్తున్నారు. ఈ ఇద్ధరి మధ్య సాగే ఇగో క్లాషే మెయిన్ స్టోరీ అంటున్నారు. ప్రస్తుతం ఈ సన్నివేశాలే చిత్రీకరిస్తున్నారు వంగా. యాక్షన్ డోస్‌కు ఢోకా లేకుండా.. ఇండియన్ సినిమాకు కొత్త రకమైన సైలెంట్‌గా సాగే వైలెంట్ డ్రామాను పరిచయం చేయబోతున్నారు వంగా. ఇది చేస్తూనే కల్కి 2లోనూ నటిస్తున్నారు ప్రభాస్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
వామ్మో… ఆ ఊరి నిండా పాములే! ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న గ్రామం
Aadhaar Update: ఆధార్ అప్డేట్‌పై కేంద్రం గుడ్ న్యూస్
భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం
కుక్కను వెంబడిస్తూ వెళితే.. బయటపడిన 18 వేల ఏళ్ల రహస్య ప్రపంచం