సైయార స్టార్స్‌కు క్రేజీ ఆఫర్స్.. దశ తిరిగినట్లేనా
సయారా సినిమాతో వెండితెరకు పరిచయమైన ఆహన్ పాండే, అనిత్ పడ్డా ఇప్పుడు బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ స్టార్లు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ రొమాంటిక్ డ్రామా బాక్సాఫీస్ వద్ద 600 కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డులు తిరగరాసింది. ఈ విజయంతో ఆహన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆరు డీల్స్ పొందగా, అనిత్ కియారా అద్వానీ చేయాల్సిన పెద్ద సినిమాను దక్కించుకున్నారు.
ఒక్క హిట్ సినిమాతో ఎవరి విధి అయినా మారిపోవచ్చు. బాలీవుడ్‌లో కొత్త తారలైన ఆహన్ పాండే, అనిత్ పడ్డా విషయంలో ఇది అక్షర సత్యంగా నిరూపితమైంది. మోహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కిన సయారా సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై జాతీయ స్థాయిలో ట్రెండింగ్‌గా నిలిచింది. ఈ రొమాంటిక్ డ్రామా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి, నాలుగు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లో చేరింది. మొత్తంగా 600 కోట్ల మార్క్‌ను చేరుకొని అగ్ర తారల రికార్డులను సైతం చెరిపేసింది. ప్రస్తుతం ఓటీటీలో కూడా సయారా అదే జోరును ప్రదర్శిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వర్కింగ్ డేస్ విషయంలో ఖిలాడీ ఫార్ములా.. అక్షయ్ ఎలా ప్లాన్ చేస్తున్నారు
Salman Khan: కండలవీరుడు సల్మాన్‌ను ఇబ్బంది పెడుతున్న వరుస సమస్యలు.. అవేనట
నిద్రకు ముందు బ్యాంకు అకౌంట్లు చెక్ నాణ్యమైన నిద్రకు దూరంగా యువత
పదేళ్లుగా పచ్చి ఆకులే అతని ఆహారం. మరి అతడి ఆరోగ్యం పరిస్థితి ఏమిటి?
