Sai Pallavi: అందాల నెమలి ఆడినట్టు… మనకోసం కష్టపడి చేసినట్టు.. సోషల్ మీడియాలో ఎట్రాక్ట్ చేస్తున్న వీడియో..

|

Feb 09, 2022 | 9:55 AM

Sai Pallavi: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది అందాల భామ సాయిపల్లవి(Sai Pallavi). ఫస్ట్ సినిమాలోనే అందం అభినయంతో ఆకట్టుకుంది ఈ భామ. ఆతర్వాత వరుసగా తెలుగు సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.

Sai Pallavi: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది అందాల భామ సాయిపల్లవి(Sai Pallavi). ఫస్ట్ సినిమాలోనే అందం అభినయంతో ఆకట్టుకుంది ఈ భామ. ఆతర్వాత వరుసగా తెలుగు సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఆచితూచి కథలను ఎంచుకుంటూ.. మంచి విజయాలను అందుకుంటుంది. గత ఏడాది నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ(Love Story)సినిమాతో హిట్ అందుకున్న సాయి పల్లవి. అదే ఏడాది చివరిలో శ్యామ్ సింగరాయ్(shyamsingharoy) సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. రాహుల్ దర్శకత్వంలో వచ్చిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో నాని రెండు విభిన్నమైన పాత్రల్లో నటించి ఆకట్టుకున్నాడు. ఇక దేవదాసీగా నటించిన సాయి పల్లవి మరోసారి తన నటనతో కట్టిపడేసింది. ఈ సినిమాలో సాయి పల్లవి నటనతోనూ డాన్స్ తోనూ ఆకట్టుకుంది. ముఖ్యంగా ప్రణవలయ పాటలో పల్లవి డాన్స్ ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించింది.

ఇక సాయి పల్లవి డ్యాన్స్ చేస్తుంటే నెమలి ఆడినట్టే ఉంటుందని ఆమె అభిమానులు కొనియాడుతూ ఉంటారు. సాయి పల్లవి డాన్స్ లకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే ఈ అమ్మడు చేసిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డుల మోతమోగిస్తున్నాయి. రౌడీ బేబీ, వచ్చిండే, సారంగ దరియా పాటలు సాయి పల్లవి డాన్స్ స్టామినాను చూపిస్తాయి. తాజాగా శ్యామ్ సింగరాయ్ సినిమాకోసం పల్లవి చేసిన ప్రణవాలయ పాట రిహార్సల్స్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూస్తుంటే పాట కోసం ఈ ముద్దుగుమ్మ పడిన కష్టం కనిపిస్తుంది. ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.