కాంతార: చాప్టర్ 1కు అరుదైన గుర్తింపు.. రాష్ట్రపతి భవన్‌లో స్పెషల్
రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన కాంతార చాప్టర్ 1 రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేక ప్రదర్శనను పొంది జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని అందుకుంది. ఈ ప్రాంతీయ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ, భాషా హద్దులను దాటి సాంస్కృతిక శిఖరాలను చేరుకుంది. ఓ ప్రాంతీయ సినిమాకు జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు దక్కింది.
ఓ ప్రాంతీయ సినిమాకు జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు దక్కింది. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన “కాంతార చాప్టర్-1” రాష్ట్రపతి భవన్‌లో ప్రదర్శనకు నోచుకుంది. ఈ చిత్రం అక్టోబర్ 5న న్యూఢిల్లీలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మూడు ప్రత్యేక షోలను ప్రదర్శించారు. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఈ చిత్రం ఇప్పటికే దేశంలోనూ, విదేశాల్లోనూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే భారీ బడ్జెట్ తో నిర్మించింది. “కాంతార” బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో దీనికి సీక్వెల్ గా వచ్చిన “కాంతార చాప్టర్-1” భారీ అంచనాల నడుమ అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రికార్డులు తిరగరాసిన శ్రీశైలం రిజర్వాయర్..
AP Liquor Scam: ఏపీ కల్తీ లిక్కర్ కేసులో కొత్త లింకులు
Shilpa Shetty: చీటింగ్ కేసులో నటి శిల్పాశెట్టిపై ప్రశ్నల వర్షం
