నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది? రేణుదేశాయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Updated on: Nov 07, 2026 | 9:02 PM

పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్యగానే తనను గుర్తించడం పట్ల రేణు దేశాయ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. విడాకులు తీసుకుని 14 ఏళ్లు దాటినా ఇప్పటికీ అదే పేరుతో పిలవడం బాధ కలిగిస్తోందన్నారు. విడాకుల తర్వాత సినిమాలు నిర్మించానని, కథలు రాసి దర్శకత్వం వహించానని, డ్యాన్స్‌ షోలకు పనిచేశానని గుర్తుచేశారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉందని, అయినా సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ ఎదుర్కొంటున్నానని తాజా ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు.

రేణు దేశాయ్ అని తన పేరు చెప్పగానే తెలుగు స్టార్ హీరో పవన్ కల్యాణ్ మాజీ భార్య అనే అంతా అంటూ ఉంటారని.. కానీ విడాకులు తీసుకుని 14 ఏళ్లయినా ఇప్పటికీ అలా పిలవడం నచ్చలేదని ఈమె అంటోంది. తనపై వస్తున్న విమర్శలు, సోషల్ మీడియా ట్రోలింగ్‌పై తాజాగా రేణు.. తన రీసెంట్‌ ఇంటర్వ్యూలో స్పందించింది. ‘బద్రి సినిమాతోనే నా లైఫ్ మొదలైందని చాలామంది అనుకుంటారు. అంతకు ముందు నా జీవితం ఏం లేదన్నట్లుగా చూస్తున్నారు. మాకు విడాకులై 14 ఏళ్లు దాటిపోయింది. రాముడికి కూడా వనవాసం 14 ఏళ్లే. మరి నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది? 2012లో నేను విడాకులు తీసుకున్న తర్వాత ఓ మరాఠీ సినిమా నిర్మించాను. అది సూపర్ హిట్ అయింది. మరో మూవీకి కథ రాసి, నిర్మించి దర్శకత్వం వహించాను. డ్యాన్స్ షోలకు వర్క్ చేశాను. కవితలు రాశాను. ఇప్పుడు కూడా సినిమాల్లో నటిస్తున్నాను. నాకు ప్రత్యేక గుర్తింపు లేకపోతే ఇన్ని అవకాశాలు ఎందుకొస్తాయి?’ అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. తనపై సాగుతున్న ట్రోలింగ్ గురించి మాట్లాడిన ఈమె.. కుక్కని కాపాడినా నన్ను తిడుతున్నారు. ఆయన లేకపోతే ఆమెకు జీవించే అర్హత లేదన్నట్లుగా మాట్లాడుతారు’ అని సదరు హీరో అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన ఆవేదన వ్యక్తం చేశారు రేణు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెరపై నటులు.. కానీ నిజ జీవితంలో దొంగలు

కీరవాణి ఇంట పెళ్లి సందడి షురూ.. శుభకార్యం వచ్చే నెలలోనే..

నాకు తెలిసిన అతను స్వార్థపరుడు.. ముఖేష్‌ ఆటపై జగతి షాకింగ్ రివ్యూ..

సౌత్ హీరోయిన్లు అంటే చిన్నచూపా.. మీరేమన్నా తోపులా..

ఆ స్టార్‌ హీరో చేసిన చెడ్డ అలవాటు.. ఈ నటుడినే బలితీసుకుంది!

Loading...
Unable to load recommendations.
Follow Us