దటీజ్ ప్రభాస్‌! మనోడి మంచి మనసుకు హ్యాట్సాఫ్‌

Updated on: Sep 16, 2025 | 5:37 PM

మిరాయ్ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన మిరాయ్ సినిమాకు ఊహించిన దానికంటే పెద్ద విజయాన్ని అందుకుంది. మిరాయ్ సినిమాకు మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది.

ఈ సినిమా మొదటిరోజు ఏకంగా రూ. 27 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మైథలాజికల్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రభాస్ వాయిస్ ఓవర్ ఓ బిగ్గెస్ట్ అసెట్ గా మారింది.ఈ క్రమంలోనే ఈ మూవీ కోసం ప్రభాస్‌ ఏదైనా రెమ్యునరేషన్ తీసుకుని ఉంటాడా? అనే డౌట్ కూడా కొంతమంది నెటిజన్ల నుంచి సోషల్ మీడియాలో వ్యక్తం అవుతోంది. అయితే ఈ విషయంలో ఇప్పుడో క్లారిటీ వచ్చింది. ప్రభాస్ మంచితనం మరోసారి అందరికీ అర్థమైంది. ప్రభాస్ మంచి మనసు గురించి ఎంత చెప్పిన తక్కువే.. మిరాయ్ సినిమాకు తన వాయిస్ ఇచ్చి సినిమాకు మరింత బూస్ట్ ఇచ్చారు ప్రభాస్. ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ ఒక్క పైసా కూడా తీసుకోలేదట. తన వాయిస్ సినిమాకు ప్లస్ అవుతుందని మేకర్స్ చెప్పగానే ప్రభాస్ ఓకే చేశాడట. దాంతో ప్రభాస్ ను మరోసారి అభిమానులు ఆకాశానికెత్తేస్తున్నారు. మా ప్రభాస్ మనసు బంగారం అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక మిరాయ్ సినిమా ఓటీటీ రైట్స్ ను జియో హాట్ స్టార్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. అక్టోబర్ చివర్లో మిరాయ్ ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మిరాయ్‌ డైరెక్టర్‌కు మెగా ఛాన్స్.. స్వయంగా లీక్ ఇచ్చిన కార్తీక్

నా తండ్రి తప్పుడు పని చేశాడు.. ఇంట్లో నుంచి గెంటేశా..

ఇండస్ట్రీ వల్గర్‌గా తయారైంది.. ఓపెన్‌గా అడిగేస్తున్నారు..!

చిక్కుల్లో బాలయ్య బ్యూటీ.. విచారణకు నోటీసులు