Jr NTR: వార్‌ 2 ను అందుకే అంగీకరించాను

Updated on: Aug 10, 2025 | 3:51 PM

బాలీవుడ్‌లో ఎన్నో రికార్డులను సృష్టించిన ‘వార్’ కు సీక్వెల్‌గా వస్తున్న ‘వార్-2’ ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం, భారీ అంచనాలను సృష్టిస్తోంది. హృతిక్ రోషన్ మరోసారి ఏజెంట్ కబీర్ గా స్క్రీన్ మీద చెలరేగబోతుండగా, ఈసారి అతన్ని ఢీకొట్టే మాస్ పవర్‌గా ఏజెంట్‌ విక్రమ్‌ కేరక్టర్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చారు.

అదిరిపోయే యాక్షన్, గ్రాండ్ స్కేల్, అంతర్జాతీయ స్థాయి విజువల్స్ ఉండటంతో ఈ సినిమాకు ఇప్పటికే భారీ బజ్ క్రియేట్‌ అయింది. తన బాలీవుడ్ అరంగేట్ర చిత్రం ‘వార్ 2’ గురించి ఎట్టకేలకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఈ నేప‌థ్యంలో ప్రముఖ మ్యాగ‌జైన్‌ ‘ఎస్క్వైర్‌ ఇండియా’ తాజాగా ఎడిష‌న్ క‌వ‌ర్‌పేజీపై తార‌క్ ఫొటోను ముద్రించింది. ఆ మ్యాగ‌జైన్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఎన్టీఆర్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఒక నటుడిగా తనను తాను సవాల్ చేసుకునే పాత్రలో నటించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాకు అంగీకరించినట్లు ఎన్టీఆర్ వివరించారు. అందుకు ‘వార్ 2’ స్క్రిప్ట్ క‌రెక్ట్‌గా అనిపించింద‌ని తెలిపారు. బ‌ల‌మైన క‌థ‌తో ఇది రూపొందిన‌ట్లు తార‌క్ చెప్పారు. వార్ 2 చిత్రంలో హృతిక్ రోషన్ పోషిస్తున్న ‘కబీర్’ పాత్రకు దీటైన శక్తిగా తన పాత్రను తీర్చిదిద్దారని, ఇది కేవలం యాక్షన్‌కే పరిమితం కాకుండా మానసిక సంఘర్షణతో కూడి ఉంటుందని తెలిపారు. ఆయ‌న‌తో క‌లిసి న‌టించ‌డం త‌న‌కు ఎంతో ఆనందాన్ని ఇచ్చింద‌ని తార‌క్ చెప్పుకొచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Weather Alert: వెదర్‌ వార్నింగ్‌.. మూడు రోజులు భారీ వర్షాలు..