Ram Charan: దిమ్మతిరిగే న్యూస్ ! ఫ్యాన్స్‌కు చరణ్‌ బిగ్ సర్‌ప్రైజ్

Updated on: Mar 27, 2025 | 3:23 PM

స్టార్ హీరోల బర్తడేస్ వస్తే చాలు.. ఆ హీరోల ఫ్యాన్స్‌కు పండగ వచ్చినట్టే.! ఆ హీరోల నయా సినిమాల అప్డేట్సూ.. వీడియో గ్లింప్స్‌లు.. నయా నయా పోస్టర్లు రిలీజ్ అయినట్టే..! వాటినే బర్త్‌డే గిఫ్ట్‌లుగా ఫ్యాన్స్‌ భావించి నానా హంగామా చేసినట్టే! ఇప్పుడే కాదు జమానా నుంచి జరుగుతుంది ఇదే! అయితే మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ బర్త్‌ డే కు ఇదే జరుగుతుందని... RC16 నుంచి ఓ పవర్ ఫుల్ వీడియో గ్లింప్స్ రిలీజ్ అవడం పక్కా అనుకున్న ఫ్యాన్స్‌కు ఊహించని మెసేజ్‌ వచ్చింది.

RC16 వీడియో గ్లింప్స్ రానట్టే అనే హింట్ మేకర్స్ నుంచి బయటికి వచ్చింది. దీంతో ఫ్యాన్స్‌ డిస్సపాయింట్ అయ్యారు. కాస్త సైలెంట్ అయ్యారు. ఇక ఇది గ్రహించారోమో ఏమో తెలీదు కానీ.. ఫ్యాన్స్‌ మధ్యలో ఉన్న సైలెంట్‌ను బ్రేక్‌ చేసేందుకు.. వాళ్లలో జోష్‌ పెంచేందుకు.. తన బర్త్‌ డే గిఫ్ట్ గా చెర్రీ ఓ సర్‌ప్రైస్ ప్లాన్ చేసినట్టు తాజాగా ఓ న్యూస్ బయటికి వచ్చింది. నిజానికి బుచ్చిబాబు డైరెక్షన్లో చరణ్ చేస్తున్న సినిమా షూటింగ్ ఇప్పటికే రెండు షెడ్యూల్లను పూర్తి చేసుకుంది. బర్త్‌ డే గ్లింప్స్‌కు కావాల్సిన పుటేజీ బుచ్చిబాబుకు దొరికింది. తన వైపు నుంచి వీడియో మేకింగ్ కూడా పూర్తి అయింది. అయితే ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ ఈ మధ్యే అస్వస్థతకు గురికావడం.. ప్రస్తుతం ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ ఉండడంతో… వీడియో గ్లింప్స్‌కు సంబంధించిన మ్యూజిక్ కంపోజియన్ ఆగిపోయిందని టాక్ బయటికి వచ్చింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: డబుల్‌ కా మీటా! ఇది కదా బర్త్‌ డే బంప్స్‌ అంటే!

Court: సంచలనంగా కలెక్షన్స్‌.. రూ.50 కోట్ల క్లబ్‌లో కోర్టు మూవీ

Manchu Lakshmi: ఓ ఫ్యామిలీని బాధపెట్టారు.. క్షమాపణలు చెప్పాల్సిందే..