Bhartha Mahasayulaku Wignyapthi Review : పెళ్లాం కాదు.. భర్త ఊరెళితే.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ రివ్యూ
వరుస పరాజయాలతో సతమతమవుతున్న మాస్ రాజా రవితేజ.. తన పంథా మార్చుకుని చేసిన ప్రయత్నమే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ‘మాస్ జాతర’ లాంటి మాస్ మసాలా సినిమా తర్వాత అతి తక్కువ గ్యాప్‌లో వచ్చిన ఈ సినిమా.. రవితేజకు సక్సెస్‌ను ఇస్తుందా? పండగ బరిలో నిలుస్తుందా? అనేది ఈ పూర్తి రివ్యూలో చూద్దాం.
‘భర్త మహాశయులకు విజ్ఙప్తి’ సినిమా కథ విషయానికి వస్తే.. రామ్ సత్యనారాయణ అలియాస్ రవితేజ ఒక వైన్‌యార్డ్ ఓనర్. భార్య బాలామణి అలియాస్ డింపుల్ హయతి అంటే ప్రేమ, భయం, భక్తి ఉన్న ఓ కామన్.. రొటీన్ హస్బెండ్. ఈ క్రమంలోనే బిజినెస్ డీల్ కోసం.. స్పెయిన్ వెళ్లిన రామ్.. అక్కడ సేమ్ బిజినెస్ ఫీల్డ్‌లో ఉన్న మానస శెట్టి అలియాస్ అషికా రంగనాథ్‌ను కలుస్తాడు. అనుకోని పరిస్థితుల్లో ఫిజికల్‌గా కనెక్ట్ అవుతాడు. ఇండియాకు తిరిగొచ్చాక.. ఆ విషయాన్ని భార్యకు తెలియకుండా చూసుకుంటాడు. కానీ అదే సమయంలో స్పెయిన్ నుంచి పని మీద ఇండియాకు వస్తుంది మానస. దాంతో ఇద్దరి మధ్య ఇరుక్కుంటాడు రామ్. భార్య గురించి ప్రియురాలికి.. ఆమె గురించి ఈమెకు తెలియకుండా మేనేజ్ చేయడానికి పాట్లు పడుతుంటాడు. అలా పడే క్రమంలో ఎక్కడి వరకు వెళతాడు. తన సమస్యకు ఎలా ముగింపు పలుకుతాడు. భర్త మహాశయులకు ఏం మెసేజ్ ఇచ్చాడనేది రిమైనింగ్ కథ
