Rashmika-Allu Arjun: అల్లు అర్జున్‌కు రష్మిక భరోసా.! థాంక్యూ మై డియర్‌.. అంటూ..

|

Nov 12, 2024 | 9:33 AM

అల్లుఅర్జున్‌, రష్మిక పుష్ప ది రూల్‌’ తో అలరించేందుకు సిద్ధమయ్యారు.ఈ నేపథ్యంలో దీపావళి కానుకగా రష్మిక తనకు ప్రత్యేక కానుక పంపించినట్లు అల్లు అర్జున్‌ తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప ది రైజ్‌’ పేరుతో తొలి భాగం 2021లో విడుదలైంది. పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్‌ ఊరమాస్‌ యాక్షన్‌, శ్రీవల్లిగా రష్మిక నటన సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

అల్లు అర్జున్‌కు రష్మిక దీపావళి స్పెషల్‌ గిఫ్ట్‌ పంపించారు. ఐకాన్‌ స్టార్‌ను అదృష్టం వరించాలని కోరుకుంటూ వెండిని కానుకగా పంపించారు రష్మిక. ఈ సందర్భంగా రష్మిక.. ‘వెండి కానుకగా అందుకుంటే ఆ వ్యక్తికి అదృష్టం వరిస్తుందని మా అమ్మ చెప్పారు. ఈ వెండి వస్తువు, స్వీట్స్‌ తప్పకుండా మీకు మరెంతో లక్‌, పాజిటివిటీ, ప్రేమ అందిస్తాయని నమ్ముతున్నా’’ అంటూ సందేశాన్ని ఆమె పంపించారు. ఈ నోట్‌ను షేర్‌ చేస్తూ.. ‘‘థాంక్యూ మై డియర్‌.. ఇప్పుడు మరెంతో అదృష్టం కావాలి’’ అంటూ అల్లు అర్జున్‌ రాసుకొచ్చారు. దీనిపై రష్మిక స్పందిస్తూ.. బాక్సాఫీస్‌ వద్ద ‘పుష్ప’ తప్పకుండా రూల్‌ చేస్తుంది. మన కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రేక్షకులు మన శ్రమను గుర్తిస్తారు. ఆ విషయంలో నేను ఎంతో నమ్మకంతో ఉన్నా’’ అంటూ అల్లు అర్జున్‌కు భరోసా ఇచ్చారు రష్మిక. కూలీ స్థాయి నుంచి ఎర్రచందనం సిండికేట్‌ను శాసించే స్థాయికి పుష్ప ఏవిధంగా ఎదిగాడనే విషయాలను పార్ట్‌ 1లో చూపించారు. దీనికి కొనసాగింపుగా ‘పుష్ప ది రూల్‌’ సిద్ధమవుతోంది. ఈ మూవీ డిసెంబర్‌ 5న ఇది రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.