Ranbir Kapoor: ప్రయోగానికి రెడీ అవుతున్న రణబీర్ కపూర్
బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తన కెరీర్‌లో మరో కీలక మలుపు తీసుకోనున్నారు. ఇటీవల బ్రహ్మాస్త్ర, తూ జూఠీ మే మక్కార్, యానిమల్ వంటి విజయాలతో దూసుకుపోతున్న ఆయన ఇప్పుడు దర్శకత్వ రంగంలోకి అడుగు పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. రెండేళ్లలో సొంత కథతో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్న రణబీర్, నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ తన సత్తా చాటాలని చూస్తున్నారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రశ్రేణి హీరోలలో ఒకరైన రణబీర్ కపూర్, ప్రస్తుతం తన కెరీర్‌ను సమర్థవంతంగా సమన్వయం చేసుకుంటున్నారు. ఒకవైపు ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూనే, మరోవైపు కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లలో నటిస్తున్నారు. బ్రహ్మాస్త్రతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు పొందిన తర్వాత, తన కెరీర్ ప్రణాళిక విషయంలో రణబీర్ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. తూ జూఠీ మే మక్కార్ అనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో విజయం సాధించిన వెంటనే, బోల్డ్ కాన్సెప్ట్‌తో కూడిన యానిమల్ చిత్రంలో నటించారు. రణబీర్ ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా తెరకెక్కిన యానిమల్ కూడా ఘన విజయం సాధించి, ఆయనను చాక్లెట్ బాయ్ నుండి విలక్షణ నటుడిగా మార్చింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Spirit: కరీనా ప్లేస్‌లో మలయాళ బ్యూటీకి ఛాన్స్
మళ్లీ మొదలైన యానిమేటెడ్ మూవీస్ ట్రెండ్
విజయదశమికి ముహూర్తాలు పెడుతున్న హీరోలు
OG యూనివర్స్‌పై పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన
ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన.. వికీపీడియాకు పోటీగా మరో ప్లాట్‌ఫాం
