Ramayana Leak: ‘రామాయణ’ ట్రైలర్ లీక్ వెనక అసలు కథ ఏంటి..? పైరసీనా.. ప్రమోషన్ ప్లానా?
విడుదలకు ముందే ‘రామాయణ’ ట్రైలర్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్చ మొదలైంది. ఇది నిజమైన లీకా? లేక సినిమాపై మరింత హైప్ తీసుకురావడానికి ప్రచార వ్యూహమా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికారిక ట్రైలర్ విడుదలకు ముందే లీకైన ఫుటేజ్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.
ఈ రోజుల్లో ఏం చేసినా.. ఎంత జాగ్రత్తగా ఉన్నా పైరసీ, లీకులు మాత్రం ఆపలేకపోతున్నారు మన మేకర్స్. పెద్దా చిన్నా తేడా లేకుండా ప్రతీ సినిమాను ఇవి ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. తాజాగా రామాయణ విషయంలోను లీక్స్ బెడద తప్పట్లేదు. విడుదలకు మూడ్రోజుల ముందే ట్రైలర్ లీక్ అయిపోయింది. మరి ఇది నిజంగానే లీకైందా లేదంటే ట్రెండింగ్ కోసం కావాలనే లీక్ చేసారా..? గత రెండు మూడు రోజులుగా రామాయణ సినిమా ట్రెండింగ్‌లోనే ఉంది. విడుదల దగ్గరికి వస్తుండటంతో నాన్ స్టాప్ ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు మేకర్స్. మొన్నటికి మొన్న ఢిల్లీలో ప్రథమ్ సంకల్ప్ పేరుతో భారీ ఈవెంట్ చేసారు. దానికి రణ్‌బీర్, సాయి పల్లవి, యశ్ సహా యూనిట్ అంతా హాజరైంది. దానికి ముందు స్కూల్స్‌కు వెళ్లి అక్కడ రామాయణం గురించి చెప్పారు. ఇలా ఎక్కడ చూసినా కూడా రామాయణనే కనిపిస్తుంది కొన్ని రోజులుగా..! జూలై 24న ట్రైలర్ కూడా విడుదల చేయనున్నారు. అయితే ఇప్పటికే ఇంటర్నేషనల్ ఫిల్మ్ వేదికలపై ట్రైలర్ ప్లే చేసారు. అక్కడ్నుంచి విజువల్స్ అన్నీ లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో 3డి ట్రైలర్ లీక్డ్ వర్షన్ తెగ వైరల్ అయిపోతుంది. అందులో విజువల్స్ గురించి చర్చ కూడా మొదలైపోయింది. ట్రైలర్ నిజంగానే లీక్ అయిందా లేదంటే అంచనాలు పెంచడానికి కావాలనే లీక్ చేసారా అనేది కూడా అర్థం కాని విషయమే..! ఎందుకంటే ట్రైలర్ విడుదలయ్యే వరకు దాని గురించే డిస్కషన్ జరగాలంటే ఏదో మ్యాజిక్ జరగాలి. లీకైతే.. దానికంటే పెద్ద డిష్కషన్ పాయింట్ మరోటి ఉండదు కదా.. ఏమో అలా కూడా చేసారేమో అనే అనుమానాలు కూడా వస్తున్నాయిప్పుడు. నితీష్ తివారి ఏ రిస్కులు తీసుకోకుండా.. రామాయణ ఇతిహాసాన్ని ప్రాపర్‌గా ఫాలో అయ్యారు. కథతో పాటు ఎమోషన్.. ఎమోషన్‌కు తోడు అద్బుతమైన విజువల్స్ ఉండేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికైతే లీకైన ఫుటేజ్ బాగా ట్రెండ్ అవుతుంది. రేపు ట్రైలర్ రిలీజ్ తర్వాత పాజిటివ్ రెస్పాన్స్ వస్తే సినిమాకు అంతకంటే కావాల్సింది మరోటి లేదేమో..?
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bhagyasree Borse: ‘ఐరెన్ లెగ్’ అంటూ నన్నే ఎందుకు..? హిట్ తర్వాత భాగ్యశ్రీ బోర్సే ఘాటు కౌంటర్!
Salman Khan: కండల వీరుడికి ఏమైంది..? సల్మాన్ ఖాన్ కొత్త లుక్ చూసి షాక్‌లో అభిమానులు!
భారీ సినిమాల దర్శకుల కొత్త మిషన్.. చిన్న సినిమాలకు పాన్ వరల్డ్ సపోర్ట్!
God Of War: డిసెంబర్ నుంచి పట్టాలెక్కనున్న ‘గాడ్ ఆఫ్ వార్’.. తారక్ కోసం గురూజీ మైథాలజీ మ్యాజిక్!
జెన్ జీకి హాలీవుడ్ ఫీవర్.. తెలుగు సినిమాలు ఎందుకు కనెక్ట్ కావడం లేదు?
