RGV: ముందు నువ్వు మారు.. RGVపై అశోక్ పండిట్ ఫైర్
వివాదాలకు చిరునామాగా నిలిచే రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. రణ్‌వీర్ సింగ్‌పై ఫెడరేషన్ చర్యలను విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. దీనిపై ఫెడరేషన్ నేత అశోక్ పండిట్ ఘాటుగా స్పందిస్తూ వర్మపై విమర్శలు గుప్పించారు. దీంతో బాలీవుడ్‌లో మరోసారి వర్మ వర్సెస్ ఫెడరేషన్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.
నేను మారిపోయాను అని రామ్ గోపాల్ వర్మ చెప్తే.. అది నమ్మడం కంటే పెద్ద జోక్ మరోటి లేదు. ఎందుకంటే మనం మారిపోవాలి తప్ప ఆయన ఎప్పుడూ ఒకేలా ఉంటారు. ఆ మధ్య కొన్నాళ్లు కాస్త సైలెంట్‌గా ఉన్న వర్మ.. ఈ మధ్య మళ్లీ జోరు పెంచేసారు. తాజాగా రణ్‌వీర్ Vs ఫెడరేషన్ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.. అక్కడ ఆయనకు షాక్ తగిలింది. అదేంటో చూద్దామా..? రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరులోనే ఓ కాంట్రవర్సీ ఉంటుంది. మనోడు ఏం మాట్లాడినా, మౌనంగా ఉన్నా కూడా వివాదమే. నేను మారిపోయాను అని చెప్పినా నమ్మడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు. ఆ మధ్య నేను మారిపోయాను.. ఇకపై అన్నీ మంచి సినిమాలే తీస్తానన్నారు. అప్పట్నుంచి వర్మ నుంచి సినిమాలే రాలేదు. ఈ మధ్యే ధురంధర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. కొన్నిరోజుల పాటు ధురంధర్ సినిమాను బాగా ప్రమోట్ చేసారు వర్మ. అసలు ఇలాంటి సినిమానే రాలేదు.. అద్భుతం మహాద్భుతం అంటూ ఆకాశానికి ఎత్తేసారు. అయితే ఇదంతా జరిగాక.. దావూద్ గ్యాంగ్ నుంచి వర్మతో పాటు ధురంధర్ టీంకు కూడా బెదిరింపులు వచ్చాయనే ప్రచారం మొదలైంది. తాజాగా రణ్‌వీర్ వర్సెస్ ఫెడరేషన్ ఇష్యూలోకి ఎంట్రీ ఇచ్చారు వర్మ. రణ్‌వీర్ సింగ్‌ను ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ బ్యాన్ చేయడంపై ఫైర్ అయిన వర్మపై ఫెడరేషన్ ఛీఫ్ అడ్వైజ్ అశోక్ పండిట్ రివర్స్ అటాక్ చేసారు. ఆఫీసర్ టైమ్‌లో కార్మికులకు ఇవ్వాల్సిన 1.25 కోట్లు ఇచ్చి.. క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసారు. ముందు మీరు చక్కబెట్టుకుని సలహాలివ్వాలన్నారు. ఏదేమైనా సైలెంట్‌గా ఉంటానంటూనే సంచలనాలు రేపుతున్నారు వర్మ.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నీటి చుక్క దొరక్క ఎడారిలో 49 మంది మృతి
అండమాన్‌లో మరో భారీ గ్యాస్ నిక్షేపం.. భారత్ ఇంధన భవిష్యత్తుకు కొత్త ఆశలు
Yash: ముంబై బీచ్‌లో రూ. 24 కోట్ల ప్రాపర్టీ కొన్న యశ్!
బంగారం పెట్టుబడిదారులకు బిగ్ షాక్.. గోల్డ్ ఫండ్స్‌పై కొత్త రూల్స్..!
