Ram Charan: ఏంటి చరణ్ ఇది.! షూటింగ్‌ కోసం రిస్క్‌ చేసిన చెర్రీ.! ఆందోళనలో ఫ్యాన్స్‌..

|

Jan 21, 2024 | 11:59 AM

ట్రిపుల్ ఆర్ తర్వాత మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న చిత్రం గేమ్‌ ఛేంజర్‌. క్రియేటివ్‌ డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ కథానాయిక. దిల్‌ రాజు భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ మెగా మూవీని నిర్మిస్తున్నారు. అయితే ఎప్పటి నుంచో షూటింగ్‌ జరుగుతోంది. ఈ మూవీ రిలీజ్‌ అంతకంతకూ ఆలస్యమవుతోంది. షూటింగ్‌ పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవలే హైదరాబాద్‌లో రామ్‌ చరణ్‌ మూవీ షూటింగ్‌ పునఃప్రారంభమైంది.

ట్రిపుల్ ఆర్ తర్వాత మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న చిత్రం గేమ్‌ ఛేంజర్‌. క్రియేటివ్‌ డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ కథానాయిక. దిల్‌ రాజు భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ మెగా మూవీని నిర్మిస్తున్నారు. అయితే ఎప్పటి నుంచో షూటింగ్‌ జరుగుతోంది. ఈ మూవీ రిలీజ్‌ అంతకంతకూ ఆలస్యమవుతోంది. షూటింగ్‌ పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవలే హైదరాబాద్‌లో రామ్‌ చరణ్‌ మూవీ షూటింగ్‌ పునఃప్రారంభమైంది. స్థానికంగా ఉండే ఓ కెమికల్‌ ఫ్యాక్టరీలో సినిమాకు సంబంధించిన యాక్షన్‌ సీక్వెన్స్‌ తో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ షెడ్యూల్‌ కోసమే రామ్ చరణ్… చాలా రిస్క్‌ చేశారట.

ఇక రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌ షూటింగ్‌ జరిగే ప్రదేశం ఓ కెమికల్ ఫ్యాక్టరీ అట. ఈ కెమికల్‌ ఫ్యాక్టరీ చాలా ప్రమాదకరమట. విష వాయువులు విడుదలయ్యే అవకాశం ఉందట. అయినా తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ షూట్‌లో పాల్గొంటున్నారట రామ్ చరణ్‌. రిస్క్‌ ఉన్నా ఇక్కడే చాలా సేపు షూట్‌లో పాల్గొన్నాడట. ప్రస్తుతం ఈ వార్త హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న మెగాభిమానులు ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో రామ్‌ చరణ్‌ డెడికేషన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ముందు జాగ్రత్తగా షూటింగ్ స్పాట్‌లో చిత్ర యూనిట్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుందట. అన్నీ రకాల పరీక్షలు చేసిన తర్వాతనే షూటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ న్యూస్ అంతటా హాట్ టాపిక్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos