Rajinikanth: ఇది కదా తలైవా అంటే.. రోడ్డు పక్కన భోజనం

Updated on: Oct 07, 2025 | 3:11 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఆయన మూవీ రిలీజైందంటే ప్రపంచ బాక్సాఫీస్ షేక్ అవుతుంది. తలైవాగా జనాల గుండెల్లో స్థానం సంపాదించుకున్న ఆయన చిటికె వేస్తే ఫైవ్ స్టార్ హోటల్లో రూమ్, ఫుడ్ అన్నీ ఉంటాయి. కానీ సామాన్య ప్రజల్లాగే ఉండటాన్ని ఇష్టపడే రజనీకాంత్ మరోసారి సంప్లిసిటీ చాటుకున్నారు.

అభిమానులకు తలైవా. ఇండియన్ సినిమా సూపర్ స్టార్ గా ఆయన పేరు మారుమోగుతుంది. అలాంటి వ్యక్తి ఓ సామాన్య మనిషిలా రోడ్డు పక్కన భోజనం చేశారు. ఆశ్రమంలో బస చేశారు. మరోసారి సింప్లిసిటీ చాటుకున్న ఆయనే రజనీకాంత్. రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ సీక్వెల్ ‘జైలర్ 2 ’ నటిస్తున్నారు. ఇది 2026 జూన్‌లో విడుదల కానుంది. అయితే షూటింగ్ పెండింగ్‌లో ఉండటంతో రిషికేష్‌లోని స్వామి దయానంద ఆశ్రమానికి రజనీకాంత్ వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గంగా ఆరతిలో పాల్గొన్న సూపర్‌స్టార్‌ గంగా తీరంలో ధ్యానం కూడా చేసారు. అంతే కాకుండా రోడ్డు పక్కన రజనీకాంత్ నిలబడి ఉదయం టిఫిన్‌ చేస్తున్న పిక్స్ కూడా ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ‘జైలర్ 2’లో రజనీకాంత్‌తో పాటు మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కేరళ, గోవాలోని ప్రాంతాల్లో ఎక్కువ షూటింగ్ జరుగుతోంది. రజనీకాంత్ ఈ విరామంలో హిమాలయాలకు వెళ్లి తన ఆరోగ్యంపై దృష్టి పెట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కాంతార: చాప్టర్ 1కు అరుదైన గుర్తింపు.. రాష్ట్రపతి భవన్‌లో స్పెషల్‌

రికార్డులు తిరగరాసిన శ్రీశైలం రిజర్వాయర్..

AP Liquor Scam: ఏపీ కల్తీ లిక్కర్‌ కేసులో కొత్త లింకులు

Shilpa Shetty: చీటింగ్ కేసులో నటి శిల్పాశెట్టిపై ప్రశ్నల వర్షం

సిరిమాను దర్శనం కోసం తరలివస్తున్న లక్షలాది మంది భక్తులు..

Published on: Oct 07, 2025 03:08 PM